ఏటీఎఫ్ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు
ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం.. ఏటీఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా జరిగాయి. తెలంగాణ కల్చరల్ నైట్ పేరుతో ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. స్థానిక ఎర్మింగ్టన్ కమ్యూనిటీ సెంటర్‌లో కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నంచి దాదాపు 800 మంది హాజరయ్యారు.
తెలంగాణ కల్చరల్ నైట్ కార్యక్రమానికి స్థానిక విద్యాశాఖ మంత్రి జియో ఫ్రే లీ టెరిటరీ, ఎంపీలు జూలియా ఫిన్, జోడిమక్కే హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా తొలుత అమరవీరులకు, జయశంకర్ సార్‌కు నివాళులు అర్పించారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందనడానికి తెలంగాణ ఉదాహరణ అని జియో ఫ్రే అన్నారు. వేడుకలు జరుగుతున్న ప్రాంతమంతా జై తెలంగాణ నినాదాలతో మారుమోగాయి.

కల్చరల్ నైట్‌లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ప్రముఖ సింగర్ శ్రావణ భార్గవి, యాంకర్ రవి ఆటపాటలతో అలరించారు. పాటలకు పెద్దలతో పాటు పిల్లలు ఉర్రూతలూగారు. చిన్నారులు చేసిన జానపద నృత్యాలు కార్యక్రమానికి మరింత శోభ తెచ్చాయి.

మీరు ఎన్నారైలా? మీ సమస్యలు తెలుగువారితో పంచుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీకు వన్ ఇండియాకు అండగా ఉంటుంది. సమస్యలే కాదు మీ సంబురాలు, సంతోషాలను వన్ ఇండియా పాఠకులతో పంచుకోండి. మీరు పంపే వార్తలు, సలహాలు, సూచనలు telugu@oneindia.co.inకు మెయిల్ చేయండి.