మేరీల్యాండ్ సరస్సులో అదృశ్యమైన భారతీయ అమెరికన్ టెక్కీ మృతదేహం లభ్యం

వాషింగ్టన్/న్యూఢిల్లీ: ఇటీవల గల్లంతైన భారతీయ అమెరికన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతదేహం లభ్యమైంది. ఏప్రిల్ 9న 30 ఏళ్ల అంకిత్ బగాయ్ అదృశ్యమయ్యాడు. అంకిత్ మృతదేహాన్ని అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలోని సరస్సు నుంచి బయటకు తీశారు. అతని మృతదేహం చర్చిల్ సరస్సులో లభ్యమైంది. నీటిలో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

అంకిత్ బగాయ్ చివరిసారిగా ఏప్రిల్ 9న ఉదయం 11.30 గంటలకు మైల్‌స్టోన్ ప్లాజా సమీపంలోని చికిత్స కేంద్రంలో నుంచి బయటికి వచ్చినప్పుడు కనిపించారు. ఆ తర్వాత అతని జాడ లేకపోవడంతో కుటుంసభ్యులు ఆందోళన చెందారు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో పోలీసులు కూడా గాలింపు చేపట్టారు.

అంకిత్ చివరిసారిగా కనిపించిన సమీపంలోని షాపింగ్ సెంటర్‌తో సహా అనేక ప్రదేశాలకు వెళ్లి పరిశీలించారు. చివరకు మేరీల్యాండ్‌లోని చర్చిల్ సరస్సులో బగాయ్ మృతదేహాన్ని గుర్తించారు. అయితే, అతడు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ప్రమాదవశాత్తు సరస్సులో పడిపోయాడా? అనేది తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 Body Of Missing Indian-American Techie Recovered From Lake in Maryland

ఇది ఇలావుండగా, సాయి తేజస్విని అనే ఓ తెలుగు అమ్మాయి ఇటీవల బ్రిటన్ బీచ్‌లో సముద్రంలో గల్లంతై ప్రాణాలు కోల్పోయింది. ఇంగ్లాండ్‌లోని సముద్ర తీరంలో సరదాగా ఈతకొడుతుండగా.. పెద్ద అలలు రావడంతో సాయి తేజస్విని అనే తెలుగు అమ్మాయి కొట్టుకుపోయింది. కోస్ట్‌‌గార్డ్ సిబ్బంది రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.

ఆ తర్వాత ఒడ్డుకు తీసుకొచ్చి సాయి తేజస్వినికి సీపీఆర్ చేసినా స్పందించలేదు. పరీక్షించిన వైద్యులు ఆమె మరణించినట్లు నిర్ధరించారు. విషయం తెలిసి తేజస్విని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సాయితేజస్విని మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకుని రావడానికి సాయం చేయాలని ఆమె కుటుంబసభ్యులు మంత్రి కేటీఆర్‌ను కోరారు. అవసరమైన సహాయం అందిస్తామని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చారు.

'మీ కుటుంబానికి జరిగిన నష్టం తీర్చలేనిది.. నా కార్యాలయ బృందం వెంటనే సహాయం చేయడానికి స్థానిక బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ బృందం-హైదరాబాద్‌తో కలిసి పని చేస్తుంది' అని కేటీఆర్ పేర్కొన్నారు. సాయి తేజస్విని మృత దేహాన్ని ఇక్కడికి తీసుకురావడానికి తమ కుటుంబం చాలా అధికార సవాళ్లను ఎదుర్కొంటోందని సాయి సోదరి ప్రియారెడ్డి చేసిన ట్వీట్‌పై కేటీఆర్ ఈ మేరకు స్పందించారు.

యూకేలో క్రాన్‌ఫీల్డ్ యూనివర్శిటీలో ఏరోనాటిక్స్ , స్పేస్ ఇంజినీరింగ్ మాస్టర్స్ చదువుతోంది సాయి తేజస్వి. ఆమె కుటుంబ సభ్యులు చెప్పిన ప్రకారం.. ఏప్రిల్ 11న బ్రైటన్ బీచ్‌లో పెద్ద అలలో చిక్కుకుని మరణించింది. అప్పటి నుంచి ఆమె మృతదేహం యూకే ఆస్పత్రిలోనే ఉంది. వాస్తవానికి బ్రైటన్ సముద్రంలో ఇటువంటి దారుణ సంఘటనలు అనేకం గతంలో జరిగాయి. లాంగ్ వీకెండ్ అవడంతో సాయి తేజస్విని విహారానికి వెళ్లినట్టు తెలుస్తోంది. సాయి తేజస్విని స్వస్థలం హైదరాబాద్ లోని సైదాబాద్. కాగా, యూకే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+