బాంబు బెదిరింపు: భారత సంతతికి చెందిన అమెరికా కంపెనీ సీఈఓ అరెస్ట్

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై విమానాశ్రయంలో బాంబు వున్నట్లు ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడిన ఆరోపణలపై అమెరికాలోని ఓ కంపెనీకి సీఈఓగా విధులు నిర్వహిస్తున్న వినోద్ మూర్జానీని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

'Bom' Or 'Bomb'? Indian-Origin CEO Of US Firm Arrested

మంగళవారం ఉదయం వచ్చిన ఈ బాంబు బెదిరింపు కాల్‌తో అనేక విమానాల రాకపోకలలో జాప్యం చోటు చేసుకుందని అధికారులు చెప్పారు. తాను ముంబై నుండి ఢిల్లీకి వెళ్లే విమానం అందుకునేందుకు ఈ బూటకపు ఫోన్‌ కాల్‌ చేసినట్లు విమానాశ్రయంలో అరెస్టయిన వినోద్‌ మూర్జానీ చెప్పారు.

కాగా, టెలిఫోన్ బూత్‌లోని సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా వినోద్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తన భార్య, పిల్లలతో వర్జీనియాకు వెళ్లే క్రమంలో వినోద్ ఈ తప్పుడు కాల్ చేసి పోలీసులకు చిక్కడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+