NRI News: కూటమి విజయంతో వేడుకలు.. రామోజీ రావుకు నివాళులు..
అమెరికా లోని న్యూ యార్క్ (New York) నగరంలో తెలుగు తమ్ముళ్లు, ఎన్డీఏ సానుభూతి పరులు కలసి టీడీపీ కూటమి విజయాన్ని ఘనంగా సెలబ్రెట్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సందర్బంగా జూన్ 23 న న్యూ యార్క్ నగరం లోని జేరికో పట్టణంలో వెంకటేశ్వరావు వోలేటి, ప్రసాద్ కోయి, అశోక్ అట్టాడ, దిలీప్ ముసునూరి కలసి పెద్దల సహకారంతో వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలలో వక్తలు డా. తిరుమలరావు తిపిర్నేని, కోటేశ్వరావు బొడ్డు, అంజు కొండబోలు, డా. జగ్గారావు అల్లూరి, డా. పూర్ణచంద్రరావు అట్లూరి, డా. కృష్ణరెడ్డి గుజవర్తి, తానా (TANA) మాజీ ప్రెసిడెంట్ జయ్ తాళ్ళూరి, సత్య చల్లపల్లి, ఉదయ్ దొమ్మరాజు, సుమంత్ రామిశెట్టి పాల్గొన్నారు. ఆర్గనైజర్లు వెంకటేశ్వరావు వోలేటి, ప్రసాద్ కోయి, అశోక్ అట్టాడ, దిలీప్ ముసునూరి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ కి జరిగిన అన్యాయాన్ని, కొత్త ప్రభుత్వం మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని, ఆశలను, బాధ్యతను గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని పనులు చేయగలరన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

మీడియా మొఘల్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, ఎందరో కళాకారులకి, విలేకరులకు జీవితాన్నిచ్చిన చెరుకూరి రామోజీ రావుకు ఘన నివాళ్ళులు అర్పించారు. అయనను స్మరించుకుంటూ సందేశం ఇచ్చారు. అయన ఆత్మాకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. మీడియా రంగంలో రామోజీ గొప్ప కృషి చేశారని ప్రశంసించారు. ఆయన మరణం తీరని లోటని పేర్కొన్నారు. ఈనాడు, ఈటీవీతో తెలుగు కొత్త ఒరవడి సృష్టించారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications