జగన్ లండన్ పర్యటన వేళ.. అక్కడే టీడీపీ నిరసన
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించింది. 2014-2019 మధ్యకాలంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలోచంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.. తగిన సాక్ష్యాధారాలతో సహా.
ఈ తెల్లవారు జామున నంద్యాల పర్యటనలో ఉన్న సమయంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు. సిటీ కోర్ట్‌లో ఆయనను ప్రవేశపెట్టారు. ఈ అరెస్ట్ పట్ల తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు భగ్గుమంటోన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు.

అటు తెలుగుదేశం పార్టీ ఎన్నారై విభాగం కూడా ఆందోళనలకు దిగింది. పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలను చేపట్టింది. లండన్‌లో టీడీపీ ఎన్నారై విభాగం ప్రతినిధులు అక్కడ నిరసనలను చేపట్టారు. అక్రమ అరెస్టులను ఖండిద్దాం.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం అంటూ నినదించారు. సైకో పోవాలి.. బాబు రావాలి అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.
తొలుత బ్రిటీష్ పార్లమెంట్ ఎదురుగా ఉన్న జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎన్నారై విభాగం ప్రతినిధులు నిరసన చేపట్టారు. మహాత్ముడి విగ్రహం వద్ద బైఠాయించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా పార్లమెంట్ భవనం సమీపంలో ఉన్న పార్క్‌లో నిల్చుని నినాదాలు చేశారు.

ప్రస్తుతం వైఎస్ జగన్ లండన్ పర్యటనలోనే ఉన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఎన్నారై టీడీపీ నేతలు ఆందోళనకు దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని, దీని వెనుక రాజకీయ కోణం ఉందని ఆరోపించారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగా ఆయనను అరెస్ట్ చేశారంటూ విమర్శించారు.
-
షాకింగ్ : పెళ్లిపై ఏపీ యువత అనాసక్తి .. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications