కువైట్‌లో గాయని చిత్ర భారీ సంగీత విభావరి
హైదరాబాద్: కువైట్ తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ఆ దేశంలో ప్రముఖ నేపథ్య గాయని చిత్ర సంగీత విభావరి జరగనుంది. ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ఆల్ మన్సూరియ ఇండరో స్టేడియంలో ఈ భారీ సంగీత విభావరి కార్యక్రమం జరుగుతుంది.
సంగీత విభావరి కార్యక్రమంలో చిత్రతో పాటు గాయకులు శ్రీకృష్ణ, సింహ, ప్రవీణ్, రమ్య బెహర, హరిణి కూడా పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి సంగీతాన్ని ఆల్ ఇన్ 7 ఇంటర్నేషనల్ గ్రూప్ వారు అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆల్ ముల్లా ఎక్స్‌ఛేంజ్ వారు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నారు. హువావి మొబైల్ కంపెనీవారు ప్లాటినం స్పాన్సర్‌గా ఉన్నారు.

కువైట్‌లోని భారత రాయబార కార్యాలయంలో నమోదైన అతి పెద్ద తెలుగు సంఘం తెలుగు కళా సమితి. తమ సభ్యుల కోసం కళా సమితి యేటా సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. తెలుగు కళా సమితి ఇటీవల సిల్వర్ జూబ్లీ జరుపుకుని 26వ యేట ప్రవేశించింది.
కువైట్ తెలుగు కళా సమితి అధ్యక్షుడిగా నరసింహ రాజు, ఉపాధ్యక్షుడిగా కుదరవల్లి సుధాకర రావు, ప్రధాన కార్యదర్శిగా వెంకట శివరావు కోడూరి వ్యవహరిస్తున్నారు.












Click it and Unblock the Notifications