NRI News: తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ ఆధ్వర్యంలో క్రిస్‍మస్ వేడుకలు..
యూకేలోని ప్రముఖ తెలుగు సంఘం తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ ఆధ్వర్యంలో క్రిస్‍మస్ వేడుకలు నిర్వహించారు. శనివారం ఈస్ట్‌హామ్‌లోని పిల్‌గ్రిమ్స్ వే చర్చిలో వేడుకలు జరిగాయి. 300 మంది తెలుగు సంఘం సభ్యులకు ఆనందం, ఉల్లాసాన్ని అందించింది.
తెలుగు సమాజం ఒక్కటై శక్తివంతమైన సంప్రదాయాలు, స్ఫూర్తిని ప్రదర్శిస్తుందని వేడుకల్లో పాల్గొన్న వారు చెప్పారు. బెతెల్మినిస్ట్రీస్ తెలుగు చర్చి, ఈస్ట్‌హామ్ బాప్టిస్ట్ చర్చి, ది లైట్‌హౌస్ ఫెలోషిప్, మనోర్ పార్క్ చర్చి, విజన్ మినిస్ట్రీస్ చర్చి, ప్రైజ్ హార్వెస్ట్ నిర్వహకులు వేడుకల్లో పాల్గొన్నారు.

చిన్నారుల ప్రదర్శనతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక క్రిస్మస్ పాటలు, యేసుక్రీస్తు జననాన్ని చిత్రీకరించే ఆకర్షణీయమైన స్కిట్‌తో చిన్నారులు ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమాలన్ని తెలుగులోనే నిర్వహించారు. పాస్టర్ డేనియల్, బ్రదర్ ప్రార్థనలు చేశారు. క్రిస్మస్ సందర్భంగా తన ఆత్మీయమైన ప్రదర్శనలతో ఆరాధన సభకు ప్రవీణ్ మణికొండ నాయకత్వం వహించారు. ఛైర్మన్ రవి సబ్బా వేడుకల్లో పాల్గొన్న వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
పిల్లలు శాంతా క్లాజ్‌ల వలె దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికీ బహుమతులు అందజేశారు. కార్యక్రమం అనంతరం డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో రవి మోచెర్ల, జెమీమా దారా, రత్నాకర్ దారా, ట్రస్టీలు కిరణ్ కప్పెట, అనిల్ అనంతుల, రవి కుమార్ రెడ్డి మోచర్ల, వెంకట్ నీల, శ్రీదేవి ఆలెద్దుల, అశోక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంల TAL ఫేస్‌బుక్ పేజీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు.












Click it and Unblock the Notifications