అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి అందుకే ఇవ్వలేదు- రేవంత్ కీలక వ్యాఖ్యలు..!!
సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. దీంతో, యూకే నుంచి అమెరికా వెళ్లాల్సిన రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ కు రిటర్న్ అవుతున్నారు. కేంద్రం అనుమతి ఇవ్వకపోవటం పైన రేవంత్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేసారు. హైదరాబాద్ రైజింగ్ ఎవరూ అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు. అధికారులను పర్యటన కొనసాగించాలని సూచించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దైంది. ప్రస్తుతం సీఎం లండన్ పర్యటనలో ఉన్నారు. యూకే నుంచి అమెరికా వెళ్లాల్సిన ఆయన.. అక్కడకు వెళ్లకుండానే పర్యటనను రద్దు చేసుకుని తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 19 నుంచి 30 వరకు పదిరోజుల పాటు విదేశాల్లో సీఎం పర్యటించాల్సి ఉంది. 23 వరకు లండన్‌లో పర్యటించనున్న సీఎం.. అక్కడి నుంచి అమెరికాలోని బోస్టన్‌కు వెళ్లాల్సి ఉంది. ఈనెల 29 వరకు అమెరికాలో పర్యటించి.. తిరిగి 30న హైదరాబాద్‌కు తిరిగి రావాల్సి ఉంది. అయితే, విదేశీ పర్యటనలకు వెళ్తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం సీఎంవో అధికారులు దరఖాస్తు చేశారు. యూకే పర్యటనకు అనుమతి లభించినప్పటికీ, అమెరికా పర్యటనకు అనుమతి లభించకపోవడంతోనే సీఎం రేవంత్ పర్యటన రద్దు చేసుకున్నారు.

కేంద్రం పై రేవంత్ కీలక వ్యాఖ్యలు
కాగా, అనుమతి రాకపోవటం పై రేవంత్ స్పందించారు. తన విదేశీ పర్యటన వికసిత్ భారత్ కు దోహద పడుతుందని భావించినట్లు పేర్కొన్నారు. దేశ నిర్మాణం కోసం రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని నమ్ముతానన్నారు. ఇదే సమయంలో అమెరికా పర్యటన కొనసాగించాలని అధికారుల బృందాన్ని సీఎం ఆదేశించారు. అన్ని ఎంవోయూలు యథాతథంగా చేసుకోవాలని, వర్సిటీలతో భాగస్వామ్య ఒప్పందాలను ఖరారు చేసుకోవాలని అధికారులకు సూచించారు. కేంద్ర నూతన విద్యా విధానాన్ని అమలు చేయటమే తమ లక్ష్యమని.. ప్రపంచస్థాయి సంస్థలను తెలంగాణకు తీసుకురావటమే పర్యటన ఏకైక ఉద్దేశ్యంగా వివరించారు. కాగా.. రేవంత్ తిరిగి ఈ నెల 23వ తేదీన హైదరాబాద్ తిరిగి రానున్నారు.












Click it and Unblock the Notifications