డీలిమిటేషన్ కు లైన్ క్లియర్, కేంద్రం లెక్క పక్కా - ఆ మీటింగ్ తో సీన్ ఛేంజ్..!?
జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త సమీకరణాలు తెర మీద కు వస్తున్నాయి. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్లు.. డీలిమిటేషన్ పైన మరో సారి కేంద్రం వేగంగా పావులు కదుపుతోంది. ఎలాగైనా ఈ బిల్లులను ఆమోదించుకోవాలని కొత్త ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా తాజాగా కొత్త లెక్కలు కలిసి వస్తున్నాయి. దీంతో, ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి బిల్లుల ఆమోదానికి కసరత్తు మొదలైంది.
కేంద్రం మరోసారి మహిళా రిజర్వేషన్లు.. డీలిమిటేషన్ బిల్లు ఆమోదం కోసం కసరత్తు వేగవంతం చేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లుల ఆమోదం కోసం ప్రయత్నాలు జరిగాయి. అయితే, జంతర్ మంతర్ వద్ద జెన్ జీ నిరసనలు.. ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ గెలుపు.. విపక్ష పార్టీలు తమ డిమాండ్ల కోసం పట్టుబడటంతో సాధ్యం కాలేదు. శివసేన (థాకరే), టీఎంసీ, ఆప్ నుంచి చీలిక వర్గం ఎంపీ ల మద్దతుతో బిల్లును ఆమోదించేలా బీజేపీ ముఖ్య నేతలు ప్రణాళికలతో సిద్దమయ్యారు. ఇండి కూటమి కీలక నేత శరద్‌పవార్‌తో ప్రధాని మోదీ ఇటీవల భేటీ కావటం వంటి పరిణామాలు.. ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన బలాన్ని ఎన్‌డీఏ సమకూర్చుకుంటుందన్న వాతావరణాన్ని సృష్టించాయి. అయితే, అనూహ్యంగా ఆవిర్భవించిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సారథ్యంలో జరిగిన జెన్‌జీ ఉద్యమం, కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామాతో కేంద్రం అంచనాలు తప్పాయి.

ప్రత్యేక సమావేశాల నిర్వహణ దిశగా
కాగా.. మారుతున్న రాజకీయ లెక్కల వేళ కేంద్రం ఆలోచన మారినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను ముందుకు తీసుకెళ్లటం కోసం దక్షిణాది పార్టీల పైన ఫోకస్ చేసింది. డీఎంకే మద్దతు ఇస్తే బిల్లు పాస్ చేసుకోవటం సులభంగా మారుతుందని భావిస్తోంది. దీంతో.. దక్షిణాదికి ఎలాంటి నష్టం లేకుండా బిల్లులో స్పష్టత ఇస్తామని డీఎంకే కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తో విభేదించిన డీఎంకే.. ఇప్పుడు కేంద్రం నుంచి దక్షిణాదికి నష్టం లేకపోతే మద్దతు ఇచ్చే అంశం పైన పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. దీని పైన స్పష్టత రాగానే.. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు కేంద్రం సిద్దం అవుతోంది. కాగా.. పార్లమెంట్ సమావేశాలు ఇప్పటికీ నిరవధికంగా వాయిదా పడలేదు. కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు.. పార్టీల్లో చీలిక వర్గాలు మారిన ఎంపీల మద్దతు.. ప్రతిపక్షం తాజా నిర్ణయాల వేళ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు.. బిల్లుల ఆమోదం వ్యవహారంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి.. ఏం జరుగుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.













Click it and Unblock the Notifications