ప్రేయసిపై కక్ష: లైవ్ బాంబు బూచి

సౌదీ అరేబియాలోని ఎన్నారై అబ్దుల్లా దేశ్‌ముఖ్ రోహా స్టేషన్ మాస్టర్‌కు ఫోన్ చేసి రైలులోని ఓ మహిళ లైవ్ బాంబుతో ఉందని చెప్పాడట. తనిఖీలు చేసిన తర్వాత అదంతా ఉత్తదే అని తేల్చుకున్నారు. ఎన్నారై చెప్పిన పేరు గల మహిళను పోలీసులు ప్రశ్నించారు. ఆమెను ప్రశ్నించిన తర్వాత బాంబు బూచీ కాల్ వెనక దేశ్‌ముఖ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
రాయగఢ్ జిల్లా మహద్‌కు చెందిన దేశ్‌ముఖ్ ఉద్యోగం కోసం మార్చిలో గల్ఫ్ వెళ్లాడు. తనకు సంబంధం ఉన్న మహిళపై ప్రతీకారం తీర్చుకోవడానికి అతను ఆ పనిచేశాడని పోలీసులు చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆ వ్యక్తితో తనకు సంబంధం ఏర్పడిందని మహిళ అంగీకరించింది.
బాంబు కాల్ రావడంతో అలీ బౌగ్ నుంచి రోహాకు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను పంపించారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications