అరుదైన గౌరవం: భారత సంతతి వ్యక్తికి గణత నోబెల్
న్యూయార్క్: ఆస్ట్రేలియాలో ఉంటున్న భారత సంతతి వ్యక్తికి ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. ఇండో-ఆస్ట్రేలియన్ అయిన గణిత శాస్త్రవేత్త అక్షయ్‌కు ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ యూనియన్ (ఐఎంయూ) గణిత నోబెల్ (ఫీల్డ్స్ మెడల్) ప్రదానం చేసింది.
స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న అక్షయ్ గణిత శాస్త్రంలో అనేక అంశాలపై విస్తృత రచనలు చేశారు. అక్షయ్‌తోపాటు మరో ముగ్గురు.. కౌచర్ బికర్, పీటర్ స్కోల్జే, అలెస్పియో ఫిగాలేలకూ ఈ గణిత నోబెల్ పురస్కారం దక్కింది. వీరికి బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో నిర్వహించిన కార్యక్రమంలో పురస్కారాలతోపాటు 15 వేల కెనడా డాలర్ల నగదు బహుమతిని ఐఎంయూ అందజేసింది.
గణిత శాస్త్ర రంగంలో విశేష కృషి చేసిన వారికి 'ఫీల్డ్స్ మెడల్'ను బహుకరిస్తారు. దీన్ని గణిత శాస్త్ర రంగంలో నోబెల్‌గా భావిస్తారు. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఈ అవార్డులను ప్రకటిస్తారు.

న్యూఢిల్లీలో జన్మించిన అక్షయ్(36) రెండేళ్ల వయసులో తన తల్లిదండ్రులతో కలిసి ఆస్ట్రేలియా, పెర్త్‌కు వెళ్లిపోయారు. ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో మ్యాథ్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అక్షయ్‌కు భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రలంటే చాలా ఇష్టం. ఇప్పటికే గణిత శాస్త్ర రంగంలో చేసిన కృషికి గాను పలు అవార్డులు అందుకున్నారు.
1924 టొరంటోలో జరిగిన మ్యాథ్య్ కాంగ్రెస్‌లో భాగంగా కెనడియన్ గణితశాస్త్రవేత్త జాన్ చార్లెస్ ఫీల్డ్ అభ్యర్ధన మేరకు 1932లో ఫీల్డ్ మెడల్‌ను ఇవ్వడం ప్రారంభించారు. అప్పటి నుంచి గణిత శాస్త్రరంగంలో అపార కృషి చేసిన వారికి ప్రతి నాలుగేళ్లకు ఒకసారి, 40ఏళ్ల లోపువారికే ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications