NRI News: ఆస్ట్రేలియాలో ఘోరం.. నలుగురు భారతీయుల మృతి..
ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలోని గస్తీ లేని బీచ్‌లో ఇద్దరు మహిళలతో సహా నలుగురు భారతీయులు నీటిలో మునిగి చనిపోయారు. ఈ ఘటన విక్టోరియాలోని ఫిలిప్ ఐలాండ్‌లో బుధవారం చోటుచేసుకుంది. 20 ఏళ్లలో విక్టోరియా జలాల్లో అత్యంత ఘోరమైన విషాదమని అధికారులు గురువారం తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు న్యూహేవెన్ సమీపంలో బీచ్ వద్ద నీటిలో నలుగురు ముగినిపోతున్నారని సమాచారం వచ్చింది.
వెంటనే స్పందించిన అధికారులు వారిని కాపాడేందుకు ప్రయత్నంచారు. ఒకరిని రక్షించి ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయినట్లు తెలిసింది.తమ పెట్రోలింగ్ లైఫ్‌గార్డ్ సైట్ నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిలిప్ ద్వీపంలోని ఫారెస్ట్ గుహల జలాల్లో ఇబ్బందుల్లో ఉన్న నలుగురికి సహాయం చేయడానికి లైఫ్ సేవింగ్ విక్టోరియాను పిలిపించినట్లు లైఫ్ సేవింగ్ విక్టోరియా స్టేట్ ఏజెన్సీ కమాండర్ కేన్ ట్రెలోర్ తెలిపారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత, తమ లైఫ్‌గార్డ్‌లు ఆఫ్ డ్యూటీ లైఫ్‌గార్డ్‌లు వారిలో ముగ్గురిని కాపాడేందుకు ప్రతయ్నించారు. తమ రెస్క్యూ టీం ఒక వ్యక్తిని రక్షించిందని పేర్కొన్నారు. అతడిని అస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత చనిపోయినట్లు చెప్పారు. ఇప్పటి వరకు చనిపోయిన వారి పేర్లను అధికారులు వెల్లడించలేదు. "ఆస్ట్రేలియాలో హృదయ విదారక విషాదం జరిగింది. విక్టోరియాలోని ఫిలిప్ ద్వీపం వద్ద మునిగిపోయిన సంఘటనలో 4 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. బృందం అవసరమైన అన్ని సహాయం కోసం మరణించిన వారి స్నేహితులతో సంప్రదింపులు జరుపుతోంది " అని కాన్ బెర్రాలోని భారత హై కమిషన్ పోస్ట్ చేసింది.
ఇది దశాబ్దాలలో రాష్ట్రం చూసిన అత్యంత దారుణమైన ముంపు సంఘటన లైఫ్ సేవింగ్ విక్టోరియా స్టేట్ ఏజెన్సీ కమాండర్ కేన్ ట్రెలోర్ అన్నారు. గురువారం మృతి చెందిన వారిలో 20 ఏళ్ల వయస్సులో ఉన్న ఒక పురుషుడు, ఇద్దరు మహిళలు, 40 ఏళ్ల వయస్సులో ఉన్న ఓ మహిళ ఉన్నారని విక్టోరియా పోలీస్ ఈస్టర్న్ రీజియన్ అసిస్టెంట్ కమీషనర్ కరెన్ నైహోల్మ్ వెల్లడించారు.
మరణించిన 43 ఏళ్ల మహిళ ఆస్ట్రేలియాలో విహారయాత్రకు వచ్చారని నైహోల్మ్ చెప్పారు. మిగిలిన ముగ్గురు మృతులు మెల్‌బోర్న్ శివారు క్లైడ్‌లో నివసిస్తున్నట్లు పోలీసులు ధృవీకరించారు. ముగ్గురు వ్యక్తులు, ఒక పురుషుడు, ఇద్దరు మహిళలు సంఘటనా స్థలంలో మరణించగా, 20 ఏళ్ల వయస్సులో ఉన్న మూడో మహిళ మెల్‌బోర్న్‌లోని ఆల్‌ఫ్రెడ్ ఆసుపత్రికి తరలించగా అక్కడ మరణించింది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications