వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆటా ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు: ఉపయోగించుకున్న 200మంది

చికాగో ప్రాంతం నుంచి దాదాపు 200మంది ప్రజలు హాజరయ్యారు.

|
Google Oneindia TeluguNews

చికాగో: అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 9, శనివారం నాడు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. బెథని ఆఫ్ ఫాక్స్ వాలీ యునైటెడ్ మెథడిస్ట్ చర్చిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా.. చికాగో ప్రాంతం నుంచి దాదాపు 200మంది ప్రజలు హాజరయ్యారు.

హెల్త్ క్యాంపుకు హాజరైనవారందిరికీ తొలుత రోగ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. రక్త నమూనాలు సేకరించి హిమోగ్లోబిన్ టెస్టు, జీవప్రక్రియల పనితీరు, లిపిడ్ టెస్టులు, కొంతమందికి పెద్ద పేగు క్యాన్సర్ పరీక్షలు కూడా నిర్వహించారు.

ప్రాథమిక సంరక్షణ, స్పెషలిస్టు ఫిజీషియన్ల ఆధ్వర్యంలో ఈ హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా పేషెంట్లకు కార్డియాలజీ, హెమటాలజీ, గైనకాలజీ ఆంకాలజీ, అనస్థియోలజీ, రేడియోలజీ పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. దంత సమస్యలతో బాధపడుతున్నవారిని డాక్టర్ సకల పరీక్షించారు. హెల్త్ క్యాంపుకు హాజరైనవారందరికీ ఇకముందు నిర్వహించే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలకు గాను ఫీజు చెల్లింపుల్లో కొంత తగ్గింపు ఉంటుందన్నారు.

free Health Fair event by The American Telugu Association (ATA)

20మందికి పైగా స్పెషలిస్ట్ వైద్యులు, 15మంది మెడికల్ స్టూడెంట్స్, 15మంది ఆటా నిర్వాహకులు, 20మంది స్వచ్చంద సేవా కార్యకర్తలు పాల్గొని ఈ హెల్త్ క్యాంపును విజయవంతం చేశారు. ప్రాథమిక ఆరోగ్య చికిత్సలతో పాటు డాక్టర్ వేమూరి మూర్తి ఆధ్వర్యంలో నడుస్తున్న చికాగో మెడికల్ సొసైటీ "Hands-On CPR and AED"పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

సిన్సినాటి యూనివర్సిటీ సౌజన్యంతో జెనెటిక్ మార్కెటింగ్, హైపర్ ట్రోఫిక్, కార్డియోమయోపతి వంటి విభాగాల్లో పరిశోధన చేయడానికి కూడా కార్యక్రమానికి హాజరైనవారికి అవకాశం కల్పిస్తున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఫిజీషియన్స్, డాక్టర్ మెహర్ మేదావరం, వంటి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆటా అడ్వైజరీ చైర్ హన్మంత్ రెడ్డి, ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ డాక్టర్ మెహర్ మేదావరం, రీజియనల్ డైరెక్టర్ వెంకట్ తుడి, రీజియనల్ కో-ఆర్డినేటర్స్ మహిపాల్ రెడ్డి, హరి రాయిణి, స్టాండింగ్ కమిటీ మెంబర్స్ సాయినాథ్ బోయపల్లి, రమణ అబ్బరాజు, జగన్ బుక్కరాజు, భాను స్వర్గం, నరసింహ చిత్తలూరి, మహీధర్ ముసుకుల, కరుణాకర్ దొడ్డం, రమణ అబ్బరాజు, అమర్ నెత్తుం, లక్ష్మీ బోయపల్లి(ఆటా ఓసీ) పాల్గొన్నారు.

English summary
The American Telugu Association (ATA) organized a free Health Fair event in Aurora, IL on Saturday, Sep 9th, 2017. The Health Fair was held in the Bethany Of Fox Valley United Methodist Church and was attended by more than 200 people from the local Chicagoland area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X