NRI News: విదేశాల్లో ఘనంగా గణపయ్య ఉత్సవాలు.. భారీగా పాల్గొన్న భారతీయులు..
విదేశాల్లో గణేషుడి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. తాజాగా దుబాయ్ అజమాన్ మైత్రిఫామ్ లో గణేష్ ఉత్సవాలు నిర్వహించారు. ఐదు రోజులు పాటు గణపయ్యకు పూజలు చేసి ఆరో రోజు నిమజ్జనం చేశారు. ఇండియా నుంచి ప్రత్యేకంగా తీసుకెళ్లిన 5 అడుగుల మట్టి గణపతి మైత్రిఫామ్ లో ప్రతిష్టించారు. ఆదివారం నిమజ్జనం చేశారు. తీన్ మార్ డప్పులతో గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చారు. పిల్లలు, పెద్దలు డ్యాన్సులు చేస్తూ గణనాథుడికి వీడ్కోలు పలికారు.
ఉదయం గణపతి హోమం, కుంకుమ పూజా కార్యక్రమాలు, గణపతి పూజలు చేశారు. అనంతరం లడ్డు వేలం పాట నిర్వహించారు. లడ్డూ వేలం పాటలో గణపతి లడ్డు రూ.1,68,000 పలికింది. లడ్డూను తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంకు చెందిన శ్రీ నాగేంద్ర డేగల దక్కించుకున్నారు. గణపతికి అలంకరించిన లక్ష్మి మాలను వేలంలో రూ.30,000 పలికింది. లక్ష్మి మాలను నిజామాబాద్ జిల్లాకు చెందిన అరుణ్ కుమార్ దక్కించుకున్నారు.

గణపతి ఉత్సవాలు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని నిర్వూకులు త్రిమూర్తులు అన్నారు. విదేశాల్లో కూడా తెలుగు సంప్రదాయం గౌరవించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అటు స్ట్రేలియాలోని మెల్బోర్న్ లో ఎప్పింగ్ కమ్యూనిటీ హాల్ వినాయక ఉత్సవాలు నిర్వహించారు. గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భారతీయులు పాల్గొన్నారు.
చివరి రోజు గణపయ్యకు పూజలు నిర్వహించి ఊరేగించారు. భక్తులు తీన్మార్ డ్యాన్సులు వేసి గణపయ్యకు వీడ్కోలు పలికారు. విదేశాల్లో ఉన్నా.. మన సంస్కృతి మరిచిపోలేమని అక్కడున్న భారతీయులు చెప్పారు. గణపతి ఉత్సవాలను నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ప్రతి సంవత్సరం ఇలా చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications