అమెరికాలో స్వాతంత్ర్య వేడుకలకు సమంత

అమెరికాలోని భారత సంతతి అమెరికన్లు ఈ నెల 15న భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని భారీస్థాయిలో నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా న్యూయార్క్‌ నగర వీధుల్లో ప్రదర్శన జరగనుంది. దీనికి ఆధాత్మిక గురువు రవిశంకర్ సారథ్యం వహిస్తారు. కథానాయిక సమంత ప్రధాన అతిగా, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గౌరవ అతిథులుగా హాజరుకానున్నారు.

న్యూయార్క్‌, న్యూజెర్సీ, కనెక్టికట్‌, న్యూ ఇంగ్లండ్‌లకు చెందిన భారతీయ సంఘాల సమాఖ్య (ఎఫ్‌ఐఏ) ఈ నెల 20వ తేదీన నిర్వహించే 41వ ఇండియా డే పరేడ్ లో భారతదేశ విలువలు, ఆశయాలను ప్రతిబింబించబోతున్నారు.

heroine samantha will attend the independence day celebrations in america

ఏపీ నాటక కళా పరిషత్ మాజీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణను అమెరికా రాజధాని డీసీలో ఘనంగా సత్కరించారు. ప్రవాసాంధ్రులతోపాటు భాను మాగులూరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణ మాట్లాడుతూ మాతృ దేశానికి దూరంగా ఉంటున్నా మాతృభాషను మరవడంలేదని, మూలాలను వదలకుండా తమ పిల్లలకు తెలుగు నేర్పుతున్నారంటూ కొనియాడారు.

ఇంట్లో తెలుగు నేర్పుతూ భాషాభిమానాన్ని దూరం కానివ్వకుండా ఉండటం చాలా గొప్ప విషయమన్నారు. పద్యం అనేది తెలుగు వారికి మాత్రమే సొంతమని, కళ ఏ రూపంలో ఉన్నప్పటికీ మానవాళికి మాత్రం క్రమశిక్షణ, వివేకం, విచక్షణ అలవడుతాయన్నారు. రంగస్థల కళాకారులను ప్రోత్సహిస్తున్న డాక్టర్ మూల్పూరి వెంకట్రావు, ప్రవాస సంఘాల కార్యవర్గ సభ్యులకు గోపాలకృష్ణ ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేశారు. సభికుల కోరిక మేరకు హరిశ్చంద్ర, మహాభారతంలోని కొన్ని సందర్భోచిత పద్యాలను ఆయన ఆలపించారు.

అమెరికాలో జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సమంత ప్రధాన అతిథిగా హాజరుకానుండటం ఇదే తొలిసారి. దక్షిణ భారతదేశంతోపాటు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న టాప్-10 హీరోయిన్ల జాబితాలో సమంత ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+