అమెరికాలో హైదరాబాద్ టెక్కీ ఆకస్మిక మృతి
హైదరాబాద్: హైదరాబాదుకు చెందిన చైతన్యా రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీరు అమెరికాలోని హూస్టన్‌లో మరణించాడు. గుండెపోటు కారణంగా అతను ఆకస్మికంగా మృత్యువు పాలయ్యాడు.
చైతన్యా రెడ్డి గుంటుక (36) సీనియర్ సాఫ్ట్‌వేర్ క్యూఎ అనలిస్టుగా హూస్టన్‌లోని రాయల్ టెక్నోక్రాట్స్ సంస్థలో పనిచేస్తున్నాడు. దాదాపు పదేళ్లుగా ఆయన అమెరికాలోని సాఫ్ట్‌వేర్ రంగంలో కృషి చేస్తున్నారు.

లామర్ విశ్వవిద్యాలయం నుంచి ఆయన మాస్టర్స్ డిగ్రీ పొందారు.. హైదరాబాదులోని శ్రీసత్య సాయి కంప్యూటర్ ఇనిస్టిట్యూట్‌లో కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పిజీ డిప్లమా చేశారు. కర్ణాటకలోని గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ తీసుకున్నారుర.
చైతన్యా రెడ్డి మృతదేహాన్ని హైదరాబాదుకు పంపించడానికి తెలంగాణకు చెందిన అమెరకన్ తెలుగు అసోసియేషన్ ప్రయత్నాలు చేస్తోంది.












Click it and Unblock the Notifications