ప్రపంచంలో అత్యంత తెలివైన విద్యార్థిని: భారతీయ అమెరికన్ నటాషా పెరియనాయగం ఘనత
అమెరికాలోని జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్(సీటీవై) ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో భారతీయ అమెరికన్ నటాషా అద్భుత ప్రతిభ కనబర్చింది.
వాషింగ్టన్: భారతీయ అమెరికన్ విద్యార్థిని నటాషా పెరియనాయగం మరోసారి సత్తా చాటింది. ప్రపంచంలోని అత్యంత తెలివైన విద్యార్థుల జాబితాలో రెండోసారి చోటు సంపాదించింది. అమెరికాలోని జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్(సీటీవై) ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో నటాషా అద్భుత ప్రతిభ కనబర్చింది.
ప్రపంచ వ్యాప్తంగా 76 దేశాల నుంచి 15,300కిపైగా విద్యార్థులు ఈ పోటీ పరీక్షల్లో పాల్గొనగా.. కేవలం 27 శాతం కంటే తక్కువ మాత్రమే అర్హత సాధించారు. అందులో 13 ఏళ్ల నటాషా ప్రథమస్థానంలో నిలవడం గమనార్హం.
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత చురుకైన విద్యార్థులను, తమ వయస్సు కంటే ఎక్కువ తెలివితేటలు కలిగిన వారిని వెలికి తీసేందుకు సీటీవై ప్రతి సంవత్సరం విభిన్న పరీక్షలు నిర్వహిస్తుంటుంది.

న్యూజెర్సీలోని ఫ్లోరెన్స్ స్కూల్‌లో చదువుతున్న నటాషా.. 2021లో నిర్వహించిన పరీక్షల్లోనూ పాల్గొని తన ప్రతిభను చాటుకుంది. అప్పటకి ఆమె ఐదో గ్రేడ్(తరగతి) చదువుతోంది. అయితే, ఆమె అప్పుడే ఎనిమిదవ తరగతి విద్యార్థి స్థాయి ప్రతిభను చూపింది. వెర్బల్, క్వాంటిటేటివ్ విభాగాల్లో 90 శాతం స్కోర్ చేసి అరుదైన గౌరవం దక్కించుకుంది.
ఈసారి తాజాగా నిర్వహించిన సీటీవై పరీక్షల్లో నటాషా తన ప్రతిభతో అరుదైన ఘనతను సాధించింది. గతంలో తెలివైన విద్యార్థుల జాబితాలో చోటు దక్కించుకున్న నటాషా పెరియనాయగమ్ తాజాగా ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. స్కాలాస్టిక్ ఆప్టిట్యూట్ టెస్ట్(ఎస్ఏటీ), ఏటీసీ పరీక్షల్లో అద్భుతంగా స్కోర్ చేసినట్లు హాప్‌కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. ఆమె అందరికంటే ఎక్కువ స్కోర్ చేసినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా సీటీవై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షెల్టాన్ మాట్లాడుతూ.. ఇది విద్యార్థులు ఒక పరీక్షలో సాధించిన విజయాన్ని గుర్తించడమే కాదు.. నేర్చుకోవాలనే తపన, పట్టుదల, ఆసక్తితో వయస్సు కంటే మించిన జ్ఞానాన్ని సంపాదించారన్నారు. దీన్ని మనమంతా గుర్తించాలని తెలిపారు. కాగా, మనదేశంలోని తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన నటాషా తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. నటాషాకు బొమ్మలు గీయడం, పుస్తకాలు చదవడం, జేఆర్ఆర్ టోల్కీన్ నవలలను డూడ్లింగ్ చేయడమన్నా చాలా ఇష్టమని వారు చెప్పారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications