ఇండియన్ అమెరికన్‌కి రెండేళ్ల జైలు శిక్ష

నిందితుడు రఘు నాయక్‌పై అభియోగాలు రుజువు కావడంతో అతనికి 5 లక్షల డాలర్ల జరిమానాతోపాటు రెండేళ్లపాటు జైలు శిక్షను విధిస్తూ యూఎస్ జిల్లా కోర్టు జడ్జి రాబర్ట్ గెటిల్‌మ్యాన్ తీర్పునిచ్చారు.
రఘు నాయక్ ఇంతకుముందు చికాగో గవర్నర్ రాడ్ బ్లగోజివిచ్ సెనెట్ సీటు కోసం జరిగిన కుంభకోణంతో కూడా సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అయితే కోర్టు ఈ నేరాన్ని పరిగణలోకి తీసుకోకుండా అతనికి శిక్షను విధించింది. నిందితుడు రఘు.. వైద్యుడికి, రోగికి ఉన్న సంబంధాన్ని అవినీతితో చెడగొట్టాడని జడ్జి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కాగా నిందితుడు తన నేరాన్ని గత ఏడాదే అంగీకరించాడు. కోర్టులో తన నేరానికి క్షమాపణలు కోరాడు. ఈ నేరానికి పూర్తి బాధ్యత తనదేనని, ఇంకేవర్నీ నిందించాల్సిన అవసరం లేదని చెప్పాడు. ఇల్లినాయిస్, ఇండియానాలలో నాయక్ సొంతంగా సర్జరీ కేంద్రాలను కలిగి ఉన్నాడు. కొందరు వైద్యులతో కుమ్మక్కైన నాయక్, రోగులను తప్పుదోవ పట్టించి తన వ్యాపారాన్ని కొనసాగించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం వైద్యులకు కొంత సొమ్మును చెల్లించేవాడని తేలింది.
సుమారు 80వేల డాలర్లను వైద్యులకు చెల్లించిన నాయక్, వారి సహకారంతో 3 మిలియన్ డాలర్లకు పైగా సంపాదించాడని ప్రాసిక్యూటర్ ఆరోపించారు. కాగా మరో 23వేల డాలర్లను ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసుకు చెల్లించాలని నాయక్‌ను కోర్టు ఆదేశించింది. రాడ్ బ్లగోజివిచ్‌ను సెనెట్ పంపేందుకు కూడా పలు అక్రమాలకు పాల్పడ్డాడని రఘు నాయక్‌పై ఆరోపణలున్నాయి.












Click it and Unblock the Notifications