మిత్రుడిని చంపిన ఇండియన్ అమెరికన్

జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసిస్తున్న వాను రాహుల్ గుప్తా కత్తితో పొడిచి హత్య చేసినట్లు అభియోగం మోపారు. 24 ఏళ్ల రాహుల్ గుప్తా బయోమెడికల్ ఇంజనీరింగ్ విద్యార్థి. ఇది దారుణమైన దాడి అని అసిస్టెంట్ స్టేట్ అటార్నీ స్టీఫెన్ చైకిన్ వ్యాఖ్యానించారు.
కోర్టు రికార్డుల ప్రకారం - గుప్తా, అతని గర్ల్ ఫ్రెండ్, వా, మరో మిత్రుడు ఆయన జన్మదిన వేడుకలను జరుపుకోవడానికి బయటకు వెళ్లారు. వేడుకల అనంతరం వారి కామన్ ఫ్రెండ్ వెళ్లిపోగా, గుప్తా, అతని గర్ల్ ఫ్రెండ్, వా అపార్టుమెంటుకు వచ్చారు.
గుప్తా గర్ల్ ఫ్రెండ్ నుంచి ఫోన్ రావడంతో తాము అపార్టుమెంటుకు వెళ్లామని, అప్పటికే వా మరణించాడని పోలీసులు తెలిపారు. వా, తన గర్ల్ ఫ్రెండ్ కలిసి మోసం చేస్తున్నారనే ఆగ్రహంతో గుప్తా ఆ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications