మిత్రుడి భార్యను హత్య చేసిన ఎన్నారై

Indian charged with murder in headless body case
సింగపూర్: తన స్నేహితుని భార్యను దారుణంగా హత్య చేసిన ఆరోపణలతో సింగపూర్‌లో నివాసం ఉంటున్న ఓ భారతీయుడిపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు, అతని స్నేహితుడు, బాధితురాలు ముగ్గురూ భారతీయులేనని పోలీసులు తెలిపారు. వారం క్రితం తల భాగం లేని బాధితురాలి మృతదేహాన్ని ఓ కాలువలో గుర్తించిన పోలీసులు, విచారణ జరిపి నిందితునిపై కేసు నమోదు చేశారు.

లాజిస్టిక్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న హర్విందర్ సింగ్ భార్య జస్విందర్ కౌర్‌ను హత్య చేసిన కేసులో నిందితుడైన అతని స్నేహితుడు గురుశరణ్ సింగ్ (25)ను ఆ దేశ ఉప కోర్టు ప్రవేశపెట్టినట్లు పోలీసులు తెలిపారు. గురుశరణ్ మరో వ్యక్తి సహాయంతో జస్విందర్ కౌర్‌ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. బాధితురాలు ఇక్కడే బ్యూటీషియన్‌గా విధులు నిర్వహిస్తోందని, డిసెంబర్ 10-12 తేదీల మధ్య హత్య జరిగి ఉంటుందని పోలీసులు తెలిపారు.

నిందితుడు ఓ సంస్థలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హత్య కేసులో డిసెంబర్ 27న మళ్లీ వాదనలు విననున్నట్లు పోలీసులు తెలిపారు. నేరం రుజువైతే గురుశరణ్‌కు కఠిన శిక్ష పడుతుందని పోలీసులు తెలిపారు. డిసెంబర్ 12న కాలువలో కొట్టుకుపోతున్న కౌర్ మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహానికి తల లేదని, రెండు చేతులు కూడా కత్తిరించబడి ఉన్నాయని పోలీసులు చెప్పారు.

బాలెస్టర్ రోడ్‌లో హర్విందర్ సింగ్, అతని భార్య జస్విందర్ కౌర్ నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే కౌర్ హత్య కేసుకు ముందు వీరిద్దరి మధ్య ఎలాంటి గొడవ జరగలేదని గుర్తించినట్లు పేర్కొన్నారు. హర్విందర్ ఫిర్యాదు మేరకు మొదట కౌర్ మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం హర్విందర్ సహాయం తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా కౌర్ మృతదేహాన్ని గుర్తించిన అరంట ముందే లాజిస్టిక్ కో-ఆర్డినేటర్‌గా విధులు నిర్వహిస్తున్న హర్విందర్ సింగ్ విధి నిర్వహణలో భాగంగా మలేషియాకు వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+