వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింగపూర్ అటర్నీ జనరల్‌గా ఎన్నారై

|
Google Oneindia TeluguNews

సింగపూర్: భారత సంతతికి చెందిన జస్టిస్ వికె రాజా(57) సింగపూర్ 8వ అటార్నీ జనరల్‌గా బుధవారం నియమితులయ్యారు. బుధవారం నుంచే అటార్నీ జనరల్‌గా రాజా నియామకం అమలులోకి వచ్చిందని సింగపూర్ అధ్యక్షుడు టోనీ టాన్ కెంగ్ యామ్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

ఇంతకుముందు అటార్నీ జనరల్‌గా ఉన్న స్టీవెన్ చోంగ్ నుంచి రాజా బాధ్యతలు తీసుకున్నారు. రాజాను ప్రెసిడెన్షియల్ మైనార్టీ రైట్స్‌ కౌన్సిల్‌లో సభ్యుడిగా కూడా సింగపూర్ అధ్యక్షుడు టాన్ నియమించారు.
ఈ పదవిలో రాజా మూడేళ్లపాటు కొనసాగనున్నారు.

Indian-origin judge appointed Singapore attorney general

2004లో సుప్రీం కోర్టు జుడిషియల్ కమిషనర్‌గా, జడ్జీగా రాజా విధులు నిర్వహించారు. 2010 నుంచి సింగపూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ ఛైర్మన్‌గా, బోర్డ్ ఆఫ్ జుడిషియల్ లెర్నింగ్ ఛైర్మన్‌గా ఆయన కొనసాగుతున్నారు.

కాగా, ప్రస్తుత సింగపూర్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా భారత సంతతికి చెందిన సుందరేశ్ మీనన్ కొనసాగుతున్నారు.

English summary
Justice V K Rajah, an Indian-origin judge, was on Wednesday appointed as the eighth attorney general of Singapore. Justice Rajah's appointment takes effect from Wednesday, said a statement from President Tony Tan Keng Yam's Office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X