హత్య కేసులో ఎన్నారైకి ఉరిశిక్ష

 Indian sentenced to death for murdering compatriot in Dubai
దుబాయ్: ఓ ప్రవాస భారతీయునికి ఇక్కడి కోర్టు మరణ శిక్షను విధించింది. డెయిరాలో తన సహచరున్ని హత్య చేసి ఓ పెట్టెలో బంధించి చెత్త కుప్పలో పడవేసిన ఘటనలో నేరస్తునిగా తేలడంతో నిందితుడైన ప్రవాస భారతీయునికి మరణ శిక్షను ఖరారు చేసింది. కోర్టు రికార్డుల ప్రకారం.. నిందితుడు ఎన్ఎస్, బాధితుని వద్ద 8,500 దిర్హామ్లను (సుమారు 2,300 డాలర్లు) మూడు వాయిదాలలో చెల్లిస్తాననే ఒప్పందంతో అప్పు తీసుకున్నాడు.

మే 22, 2013న దుబాయ్‌లోని డెయిరాలోని నిందితుని నివాసంలో వారిద్దరు అప్పుపై చర్చించుకున్నారు. అదే సమయంలో వారిద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుందని, దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. నిందితుడు ఓ తాడుతో బాధితుని మెడకు ఉరి బిగించి ప్రాణాలు తీశాడని ఆయన చెప్పారు. ఆ తర్వాత ఓ బాక్సులో బంధించి చెత్త కుప్పలో పడేశాడని అక్కడ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి తెలిపారు.

అది గమనించిన తర్వాత తాను పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు సెక్యూరిటీ గార్డు చెప్పారు. గార్డు సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, నిందితున్ని, అతనికి సహకరించారన్న కారణంతో మరో ముగ్గుర్ని కూడా అరెస్ట్ చేశారు. అయితే హత్య విషయంతో తమకు సంబంధం లేదని, ఏదో అద్దం ముక్కలు ఉన్నాయని బాక్సును తరలించేందుకు సహకరించాలని కోరడంతో బాక్సును పట్టుకున్నామని వారు తెలిపారు.

బాక్సును తరలించేందుకు సహకరిస్తే 50 దిర్హాంలు ఇస్తానని ప్రధాన నిందితుడు చెప్పాడని ఒకరు, 25 దిర్హాంలు ఇస్తానని చెప్పాడని మరొకరు తెలిపారు. కాగా ముగ్గురు నిందితులను ప్రశ్నించిన పోలీసులు, హత్యతో సంబంధం లేదని వారిని విడిచిపెట్టారు. ప్రధాన నిందితుడు ఎన్ఎస్‌ను మే 23న అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. కాగా తీర్పుపై 15 రోజులలో అప్పీల్ చేసుకోవచ్చని కోర్టు తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+