అమెరికాలో దారుణం.. నలుగురు తెలుగువారి అనుమానాస్పద మృతి
లోవా : అమెరికాలోని అయోవా రాష్ట్రంలో దారుణం జరిగింది. ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు అనుమానాస్పదరీతిలో మృతి చెందారు. వెస్ట్ డి మాయిస్ సిటీలో ఈ ఘటన జరిగింది. మృతులను సుంకర చంద్రశేఖర్, లావణ్యలతో పాటు 15, 10ఏళ్లున్న వారి కుమారులుగా గుర్తించారు. మృతదేహాలపై ఉన్న గాయాల ఆధారంగా వారిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
మృతులు నివాసముంటున్న ఇంట్లో మరో కుటుంబం అద్దెకు ఉంటోంది. వారు మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టంకు పంపారు. ఘటనాస్థలంలో పరిస్థితిని బట్టి హత్య అయి ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు ఆ దిశగా విచారణ వేగవంతం చేశారు. అయితే ఎవరు ఏ కారణం చేత ఈ దారుణానికి పాల్పడ్డారన్నది ఇంకా స్పష్టం కాలేదు.

పోలీసులు ఇచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం మృతుడు చంద్రశేఖర్‌ది గుంటూరు జిల్లాగా తెలుస్తోంది. చుండూరులో చదువుకున్న ఆయన ఉన్న విద్య కోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆయన తల్లిదండ్రులు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు.
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్












Click it and Unblock the Notifications