దుబాయ్ లో ఉద్యోగం.. నెలకు రూ.14 లక్షల జీతం!

Posted By:
Subscribe to Oneindia Telugu

దుబాయ్: ఈ ప్రకటన చూస్తే పాపం నిరుద్యోగులు ఎగిరి గంతేస్తారు. అంతేకాదు, అప్పటికప్పుడే దుబాయ్ వెళ్లే ప్రయత్నాలు ఆరంభిస్తారు. దుబాయ్ లోని ఓ కంపెనీ తన సేల్స్ విభాగంలో ఉద్యోగాలకు భారీ జీతాన్ని ఆఫర్ చేసింది.

దుబాయ్ లోని అల్సాప్ అండ్ అల్సాప్ ఎస్టేట్ అనే కంపెనీ ఏడాదికి 2 లక్షల పౌండ్లు అంటే మన కరెన్సీలో అక్షరాలా ఒక కోటి 70 లక్షల 36 వేల రూపాయలు జీతం ఇస్తామంటూ ఒక భారీ ప్రకటన విడుదల చేసింది.

 Job in Dubai.. Rs.14 Lakhs Salary per month

అభ్యర్థులకు ఆకర్షణీయమైన రూపం, ఆకట్టుకునే వాక్చాతుర్యం ఉండాలట. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందని, అయితే తమను తాము ప్రూవ్ చేసుకున్న వారిని అనుభవం లేకపోయినా తీసుకుంటామని చెబుతోంది. జీతం 75 వేల పౌండ్లతో ప్రారంభం అయి 2 లక్షల పౌండ్ల వరకు ఇస్తామంటోంది.

నెలకు రూ.14 లక్షల జీతం లభించే ఈ ఉద్యోగానికి ఎంత చదివారనేది ముఖ్యం కాదట, అభ్యర్థుల దగ్గర ఉన్న టాలెంట్ ను చూసి ఉద్యోగానికి ఎంపిక చేస్తారట. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వారి రెజ్యూమ్ లను careers@allsoppandallsopp.comకు మెయిల్ చేయవచ్చని అల్సాప్ అండ్ అల్సాప్ ఎస్టేట్ కంపెనీ కోరుతోంది.

తమకు అందిన రెజ్యూమ్ లను వడపోసి, నవరంబర్ 14న దుబాయ్ లోని క్రౌన్ ప్లాజా, లివర్ పూల్ సిటీ సెంటర్ వద్ద సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ప్రకటించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Does the thought of working for the leading real estate agency in Dubai excite you? Like the idea of earning £75,000 - £200,000 OTE, tax free, per year? If you are working as an Estate Agent, Sales Negotiator, Property Lister/Valuer, Lettings Negotiator or within another heavily targeted sales role, in the UK and you are looking for the next step in your career, then apply directly with us today. Recognised again in 2017 by Forbes Middle East, as a Top 100 Real Estate Agent with an unrivalled reputation in Dubai for success, we are looking for motivated, driven sales people to join our growing, dynamic team.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి