MA Yusuff Ali: పెద్ద మనస్సు చాటుకున్న లులు గ్రూప్ అధినేత..

భారతీయ బిలియనీర్, లులు గ్రూప్ ఛైర్మన్ ఎంఏ యూసుఫ్ అలీ ఓ పేద మహిళకు అండగా నిలిచారు. అప్పు తీర్చలేదని ఆమె ఇంటిని ఫైనాన్స్ సంస్థ జప్తు చేసింది. దీంతో ఆ మహిళ వీధిన పడగా.. యూసుఫ్ అలీ ఆమెకు ఆర్థిక సాయం చేసి గొప్ప మనస్సు చాటుకున్నాడు. బ్యాంక్ లోన్ తీర్చడమే కాకుండా మహిళకు రూ.10 లక్షల సాయం కూడా చేశాడు. దీంతో ఆయన దాతృత్వానికి అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. కేరళలోని నార్త్ పరవూర్‌లో నివసించే సంధ్య దీనస్థితిని మీడియా ద్వారా తెలుసుకున్న అలీ.. ఆమెకు సాయం చేశారు.

సంధ్య, ఆమె భర్త ఇల్లు నిర్మించుకోవడానికి 2019లో మణప్పురం ఫైనాన్స్ లో రూ.4 లక్షల రుణం తీసుకున్నారు. మడప్లతురుత్‌లోని 4.8 సెంట్ల స్థలంలో ఇళ్లు కట్టుకున్నారు. ఆ డబ్బుతో ఇళ్లు నిర్మాణం పూర్తి కాలేదు. ఈ క్రమంలోనే 2021లో సంధ్య భర్త ఆమెను విడిచి వెళ్లిపోయాడు. దీంతో ఆమె 12, 7 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలతో జీవనం కొనసాగిస్తోంది. అయితే రుణం చెల్లించడానికి వారి వద్ద డబ్బు లేదు. దీంతో లోన్ సొమ్ము, దాని పై వడ్డీ కలిపి రూ.8 లక్షలకు చేరింది.

Lulu Group Chairman MA Yusuf Ali helped a poor woman

లోన్ ఇచ్చిన వారు తిరిగి చెల్లించాలని సంధ్యపై ఒత్తిడి తీసుకొచ్చారు. అయినప్పటికీ వారు రుణం తిరిగి చెల్లించే పరిస్థితిలో లేరు. దీంతో మణప్పురం ఫైనాన్స్ వారి ఇళ్లును జప్తు చేసింది. సోమవారం ఫైనాన్స్ సంస్థ అధఇకారులు ఇంట్లోకి వచ్చి.. సంధ్య, ఆమె పిల్లలను బయటకు పంపారు. ఇంటికి తాళం వేశారు. కనీసం వారి వస్తువులను తీసుకునేందుకు కూడా అనుమతి ఇవ్వలేదు. ఈ విషయం స్థానిక మీడియాలో వైరల్ అయింది. ఈ విషయంలో ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్ జోక్యం చేసుకున్నారు.

అయినా సమస్య సర్దుమణగలేదు. ఈ విషయం యూఏఈలో ఉన్న కేరళకు చెందిన యూసుఫ్ అలీ తెలిసింది. దీంతో ఆయన తన బృందానికి ఆదేశాలు జారీ చేశారు. సంధ్యం రుణం చెల్లించాలని చెప్పారు. ఆయన ఆమె కుటుంబానికి రూ.10 లక్షలు అందజేసినట్లు మలయాళీ వార్త సంస్థలు పేర్కొన్నాయి. సోమవారం సాయంత్రం లులు గ్రూప్ మీడియా కోఆర్డినేటర్ సంధ్యకు ఇంటి తాళాలను ఇచ్చారు. డబ్బు కుటుంబ భవిష్యత్తు కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+