వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్టోబర్ 2న ఇర్వింగ్‌లో 'గాంధీ మోమోరియల్ పార్క్'‌

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

డల్లాస్: శాంతి, అహింస నినాదంతో ప్రపంచ శాంతి పాడుపడని మహాత్మా గాంధీ జన్మదినమైన అక్టోబర్ 2న డల్లాస్‌లోని ఇర్వింగ్‌లో 'గాంధీ మోమోరియల్ పార్క్'‌ను ఆయనకు అంకితం చేయనున్నారు. ఈ మెమోరియల్ పార్క్ లో మహాత్మునితో పాటు ప్రపంచ శాంతి కోసం పాటుపడిన లీడర్ల విగ్రహాలను ప్రతిష్టించనున్నారు.

ఈ మహాత్మా గాంధీ మెమోరియల్ పార్క్‌ను అక్టోబర్ 2న సాయంత్రం 4:30 నిమిషాలకు థామస్ జెఫర్సన్ పార్క్ 1201 హిడెన్ రిడ్జ్‌లో ప్రారంభించనున్నారు. నాలుగేళ్ల నిరంతర శ్రమకి ప్రతిఫలంగా ఈ పార్క్‌ను ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ మెమోరియల్ ప్లాజా ఆవిష్కరణలో ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్‌షిప్ కౌన్సిల్ (ఐఎఎఫ్‌సీ), ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఐఎఎన్‌టీ)తో పాటు ఇర్వింగ్ సిటీ ప్రజలు చేసిన సహాకారం మరువలేనిదన్నారు.

Mahatma Gandhi Statue and Memorial in Dallas

అమెరికా మొత్తం మీద 17 మహాత్మా గాంధీ విగ్రహాలు స్దాపించబడ్డాయి. మహాత్మా గాంధీ యొక్క 7 అడుగుల పొడవు, 30 అంగుళాల వెడల్పైన కాంస్య విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ శిల్పి, రాష్ట్రపతి అవార్డు గ్రహీత బుర్రా వరప్రసాద్ చెక్కారు.

విగ్రహానికి ముందు భాగంలో ఉన్న గ్రానైట్ గోడపై మహాత్మా గాంధీ యొక్క చిరస్మరణీయ పదాలు చెక్కించారు. ఇర్వింగ్ సిటీకే తలమానికంగా నిలిచిన థామస్ జెఫర్సన్ పార్క్‌లో మహాత్మా గాంధీ విగ్రహాం ప్రతిష్టించడం చాలా గొప్ప విషయం.

18 ఎకరాల భూమిలో విగ్రహాం చుట్టూ పూల మొక్కలు, గడ్డి, పౌంటైన్స్ మొదలైనవి ఏర్పాటు చేశారు. మహాత్మా గాంధీ మెమోరియాల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఛైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ఈ విగ్రహాం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా మహాత్మా గాంధీ మునిమనవడు సతీష్ ధుపేలియా హాజరవుతున్నారని తెలిపారు.

ప్రత్యేక అతిధులుగా కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా పి. హరీష్, యుఎస్ కాంగ్రెస్ ఉమెన్ ఎడ్డీ బెర్నిస్ జాన్సన్, యుఎస్ కాంగ్రెస్ ఉమెన్ తులసీ గబ్బర్డ్ , ఇర్వింగ్ సిటీ మేయర్ బెత్ వాన్ డ్యుయెన్, డాక్టర్ ప్రసాద్ గొల్లానపల్లి, రెవరెండ్. జెరోమ్ లెడౌక్స్ హాజరుకానున్నారు.

శనివారం, అక్టోబర్ 4వ తేదీన 'మహాత్మా గాంధీ పీస్ వాక్ -2014'న కూడా నిర్వహించనున్నట్లు డాక్టర్ ప్రసాద్ తోటకూర తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా దక్షిణాఫ్రికా మాజీ అద్యక్షుడు నెల్సన్ మండేలా ముని మనవడు నదబా మండేలా హజరవుతారని వెల్లడించారు.

English summary

 The Mahatma Gandhi Memorial Park dedication is being held Thursday October 2nd , 2014 at 4:30 P.M. at Thomas Jefferson Park 1201 Hidden Ridge, just off MacArthur Blvd in Irving
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X