టాక్ లోగోని ఆవిష్కరించిన ఎంపీ కవిత..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ (TAUK -టాక్) లోగోను హైదరాబాద్ లో ఎంపీ కవిత గారు ఆవిష్కరించారు. లండన్ నుండి వచ్చిన టాక్ ప్రతినిధులు నర్రా సాయి,రాకేష్ రెడ్డి కీసర ఎంపీ కవిత గారిని కలిసి సంస్థ ఆశయాలను, బంగారు తెలంగాణ నిర్మాణంలో వారి పాత్ర
గురించి వివరించారు.

MP Kavitha launched logo of United kingdom

తెలంగాణ ఆడబిడ్డ కవిత గారి చేతుల మీదుగా లోగోను ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందని,ఎప్పటికప్పుడు వారి సలహాలు సూచనలతో ముందుకు వెళ్తామని, మమ్మల్ని ప్రోత్సహించి లోగోను ఆవిష్కరించినందుకు కవిత గారికి కృతఙ్ఞతలు తెలిపారు. నూతనంగా ఏర్పడుతున్న సంస్థ యూకేలో నివసిస్తున్న తెలంగాణ బిడ్డలతో పాటు క్షేత్రస్థాయిలో కూడా మంచి
సేవలందించాలని కోరారు.

MP Kavitha launched logo of United kingdom

అలాగే సంస్థ కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. జనవరి 28 న లండన్ లో ఘనంగా ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నట్టు సంస్థ ప్రతినిధి నర్రా సాయి తెలిపారు. ఈ కార్యక్రమం లో
ఇతర సభ్యులు రాజ్ కుమార్ శానబోయిన , మల్లేష్ పప్పుల, సుభాష్ కుమార్ తదితరులు
ఉన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TRS MP Kavitha launched United Kingdom logo in Hyderabad. Tauk-Telangana association of united kingdom members are designed this logo
Please Wait while comments are loading...