Chigurupati Jayaram: చిగురుపాటి జయరామ్ హత్య కేసులో రాకేష్ రెడ్డి జీవిత ఖైదు విధించిన కోర్టు
చిగురుపాటి జయరామ్ హత్య కేసు నిందితుడు రాకేష్ రెడ్డికి నాంపల్లి కోర్టు జీవిత ఖైదు విధించింది..
ప్రవాస భారతీయుడు (NRI) చిగురుపాటి జయరామ్(Chigurupati Jayaram)ను హత్య కేసులో దోషిగా తేలిన రాకేష్‌రెడ్డికి నాంపల్లి కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో ముగ్గురు పోలీసులతో సహా మరో 11 మంది నిందితులను నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. ఈ కేసులో ఏసీపీ మల్లారెడ్డితో పాటు మరో ఇద్దరు సీఐలను నిర్దోషులుగా కోర్టు తేల్చింది. ఈ కేసుకు సంబంధించి కొద్ది రోజుల క్రితం 23 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.. అందులో 12 మందిని నిందితులుగా చేర్చారు. మొత్తం 73 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం రాకేష్ రెడ్డి(Rakesh Reddy)ని దోషిగా నిర్ధారించింది.
2019 జనవరి 31న జూబ్లీహిల్స్‌లో జయరామ్ హత్యకు గురయ్యాడు. అయితే నిందితుడు రాకేష్ రెడ్డి విజయవాడలోని నందిగామ సమీపంలో రోడ్డు ప్రమాదం కేసుగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. జయరాం మృతదేహాన్ని విజయవాడలోని నందిగామ వద్ద రహదారిపై కారులో ఉంచాడు. అనుమానించిన పోలీసులు దాన్ని హత్యగా నిర్ధారించారు.













Click it and Unblock the Notifications