తుఫాన్ సహాయం: తెలుగు విద్యార్ధినికి మోడీ ప్రశంస
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ వరద బాధితుల కోసం విరాళాలు సేకరించిన కువైట్‌కు చెందిన తెలుగు విద్యార్ధిని దువ్వూరి రోహిణి ప్రత్యూషను ప్రధాని మోడీ అభినందించారు. కువైట్‌లోని భారతీయ విద్యాభవన్‌లో 12వ తరగతి చదువుతున్న రోహిణి ప్రత్యూష కాశ్మీర్ వరద బాధితుల కోసం రూ. 2.15 లక్షలు సేకరించి కువైట్‌లో ఉన్న భారత కార్యాలయానికి అందజేసింది.
పాఠశాల ముగిసిన తర్వాత కువైట్‌లో ఉన్న భారతీయుల గృహాలకు వెళ్లి ఆమె విరాళాలు సేకరించింది. రోహిణి ప్రత్యూష అందజేసిన విరాళాన్ని భారత దౌత్య కార్యాలయం ప్రధాని సహాయ నిధికి అందించింది.

ఈ విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆమెను ప్రశంసిస్తూ లేఖ రాశారు. తుఫాన్ వరదల కారణంగా అతలాకుతులమైన కాశ్మీర్ బాధితులకు సహాయం చేసేందుకు రోహిణి ప్రత్యూష చూపిన చొరవ ప్రశంసనీయమని అన్నారు. వరద బాధితుల పట్ల రోహిణి ప్రత్యూష స్పందించిన తీరును ప్రధాని మోడీ కొనియాడారు.












Click it and Unblock the Notifications