అదిరిపోయిన తానా వేడుకలు.. గ్రాండ్ సక్సెస్ (ఫోటోలు)

Subscribe to Oneindia Telugu

న్యూయార్క్ : తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) 40వ వార్షికోత్సవ ప్రారంభ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తానా పురుడుపోసుకున్న న్యూయార్క్ లోని ఓ హిందూ దేవాలయం దగ్గరే ఈ తాజా వేడుకలు జరగడవ విశేషం. వేలమంది తెలుగు ప్రజానీకం మధ్య జూలై 16న ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి.

40 సంవత్సరాల క్రితం మే28,29 1977లో వేడుకలను నిర్వహించిన న్యూయార్క్ తెలుగు సాహితీ సాంస్క్రుతిక సమాఖ్య ఈ 40 వ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషించింది. ఈ సందర్బంగా తానా ప్రస్తుత అధ్యక్షులు డాక్టర్ వి.చౌదరి జంపాల వేడుకల పట్ల తన సంతోషం వ్యక్తం చేశారు.

అలాగే తెలుగు రాష్ట్రాల్లో తానా చేపడుతోన్న పలు అభివ్రుద్ది సంక్షేమ కార్యక్రమాల గురించి ఈ సందర్బంగా వివరించారాయన. భవిష్యత్తులో తానా సేవలను తెలుగు వారికే పరిమితం చేయకుండా మరింత విస్త్రుతం చేయాలని భావిస్తున్నట్లుగా చెప్పారు. ఇదే సందర్బంగా వచ్చే ఏడాది జరగబోయే తానా సభలకు కూడా పెద్ద సంఖ్యలో తెలుగువారు హాజరు కావాలని పిలుపునిచ్చారు చౌదరి జంపాల.

మురళీ మోహన్

మురళీ మోహన్

వేదికపై టీడీపీ రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ తో పాటు తెలంగాణ సాంస్కృతిక శాఖ చైర్మన్ రసమయి బాలకిషన్, అలాగే తానా వ్యవస్థాపకులు డాక్టర్. రవీంద్రానాథ్ గుత్తికొండ. అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలంతా ఒక్క చోట కలుసుకోవాలన్న గుత్తికొండ గారి ఆలోచనే ఈ తానా సభల ఏర్పాటుకు బీజం.

తానా

తానా

తానా ప్రప్రథమ సభలు మే 28, మే29 1977లో జరిగాయి. వ్యవస్థాపకులు గుత్తికొండ గారి ఆలోచనతో అమెరికాలో ఉన్న తెలుగు వారికి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజానీకానికి మధ్య తానా ఓ వారధిగా ఏర్పడింది. 39 ఏళ్ల క్రితం అప్పటి సభల్లో ఉపయోగించిన బ్యానర్ ను ఇప్పటిదాకా భద్రపరిచిన గుత్తికొండ కుటుంబం తాజా తానా సభల సందర్బంగా దాన్ని తెలుగు ప్రజల ముందుంచింది.

సాంస్కృతిక కార్యక్రమాల్లో

సాంస్కృతిక కార్యక్రమాల్లో

తానా వేడుకలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా.. తమదైన ఆటపాటతో అలరిస్తోన్న జానపద కళాకారులు.

స్వాగత బ్యాలెట్

స్వాగత బ్యాలెట్

తానా సభల కోసమే ప్రత్యేకంగా ఓ స్వాగత బ్యాలెట్ ను రాసిన వడ్డేపల్లి కృష్ణ గారిని జ్ఞాపిక మరియు శాలువాతో సన్మానిస్తున్న సందర్బం.

మురళీ మోహన్

మురళీ మోహన్

ఎంపీ మురళీ మోహన్ గారికి గుత్తికొండ చేతుల మీదుగా సన్మానం.. ఈ సందర్బంగా మాట్లాడిన ఎంపీ మురళీమోహన్ తానా సేవలను కొనియాడారు. అత్యవసర పరిస్థితుల్లో తానా 'ఎమర్జెన్సీ అసిస్టెన్స్ టీమ్' నుంచి అందుతోన్న సహకారాన్ని ఆయన ప్రశంసించారు.

ఎం.ఎం.శ్రీలేఖను

ఎం.ఎం.శ్రీలేఖను

సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖను సన్మానిస్తున్న తానా నిర్వాహకులు. ఆయా రంగాల్లో విశేషమైన సేవలందిస్తున్న పలువురు తెలుగువారిని తానా ప్రతీ ఏటా సత్కరిస్తోంది.

కూచిపూడి

కూచిపూడి

ఇదే వేదిక మీద కూచిపూడి నృత్యానికి సంబంధించి కూచిపూడి నృత్యకారుడు హలీమ్ ఖాన్ రూపొందించిన సీడీనీ ఈ సందర్బంగా ఎంపీ మురళీ మోహన్, తానా అధ్యక్షుడు చౌదరి జంపాల ఆవిష్కరించారు.

మురళీ మోహన్

మురళీ మోహన్

తానా సేవల గురించి కొనియాడిన మురళీ మోహన్ భవిష్యత్తులోను తెలుగువారికి తానా సహకారం ఇలాగే కొనసాగాలని ఆకాక్షించారు.

తానా బోర్డు

తానా బోర్డు

తానా బోర్డు అధ్యక్షుల చైర్మన్ డాక్టర్ ఉప్పులూరిని సన్మానిస్తున్న తానా సభ్యులు జై తాల్లూరి మరియు మురళీ వెన్నం

తానా వ్యవస్థాపక బృందం

తానా వ్యవస్థాపక బృందం

తానా వ్యవస్థాపక బృందం, మరియు గతంలో తానాకు అధ్యక్షులుగా పనిచేసిన పలువురిని సత్కరిస్తున్న సందర్భం..

 గుత్తికొండకు

గుత్తికొండకు

తానా వ్యవస్థాపకులు గుత్తికొండకు ఎంపీ మురళీ మోహన్, తెలంగాణ ఎమ్మెల్యే సాంస్కృతిక శాఖ చైర్మన్ రసమయి బాలకిషన్ చేతుల మీదుగా సన్మానం.

గుత్తికొండ

గుత్తికొండ

ఈ సందర్బంగా మాట్లాడిన గుత్తికొండ.. 1776లో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లోటిల్లా ఆఫ్ టాల్ షిప్ స్పూర్తితోనే తెలుగు అసోసియేషన్ ను ఏర్పాటు చేయాలన ఆలోచన తనలో మొదలైందని ఆయన వివరించారు.

ఆహుతులను

ఆహుతులను

సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా.. ఆహుతులను ఆకట్టుకున్న యువతీ యువకుల డ్యాన్స్ కార్యక్రమం..

కళాకారులు గానం

కళాకారులు గానం

సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా.. కొంతమంది అంధ కళాకారులు గానం, వాయిద్యాల ద్వారా తమ ప్రతిభను చాటుతోన్న దృశ్యం

సాంప్రదాయ కళా

సాంప్రదాయ కళా

సాంప్రదాయ కళా నృత్యాలతో ఆహుతులను కట్టిపడేసిన యువతుల సాంప్రదాయ న్యత్యం..

వందల సంఖ్యలో

వందల సంఖ్యలో

వందల సంఖ్యలో తానా సభలకు హాజరైన తెలుగువారు.. ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలతో తానా వేడుకల్లో భాగస్వామ్యం అయ్యారు.

తెలంగాణ ఎమ్మెల్యే

తెలంగాణ ఎమ్మెల్యే

తెలంగాణ ఎమ్మెల్యే, సాంస్కృతిక శాఖ చైర్మన్ ను ఎంపీ మురళీ మోహన్, తదితరులు సత్కరిస్తున్న సందర్బం. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన తానా సభల్లో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu Association of North America (TANA), the oldest and largest nation-wide ethnic Indian organization, celebrated the Inaugural Ceremony of its 40th Anniversary in grand style at the very place it began

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి