టీఆర్ఎస్ గెలుపు: మలేసియాలో టీఆర్ఎస్ విజయోత్సవాలు

అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయం సాధించడంతో ఎన్నారై టీఆర్ఎస్ మలేషియా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, ఆట పాటలతో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఎన్నారై తెరాస మలేషియా అధ్యక్షులు చిట్టి బాబు మాట్లాడుతూ... తెరాస మలేషియా ఆధ్వర్యంలో "100 కార్లు-100 సీట్లు" అనే నినాదంతో 100 కార్లతో భారీ కారు ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు.

అలాగే టీఆర్ఎస్ మిషన్ మరియు కాల్ క్యాంపెయినింగ్‌లో భాగంగా ౩౦ మందితో కూడిన తెరాస మలేషియా బృందం 6000 కాల్స్ చేసి తెరాస అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించి కేసీఆర్‌కు మళ్లీ ఓటు వేసి గెలిపించమని కోరిన కమిటీ సభ్యులకు, యావత్ తెలంగాణ ప్రజానికానికి ధన్యవాదాలు అన్నారు.

NRI Malaysia celebrates TRS victory
NRI Malaysia celebrates TRS victory

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కుర్మ మారుతి, జనరల్ సెక్రటరీ గుండా వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు బొడ్డు తిరుపతి, రమేష్ గౌరు, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ బోయిని, జీవన్ కుమార్, సత్యనారాయణ రావు, అరుణ్ మునిగాల, సందీప్ కుమార్ లగిశెట్టి, శ్రీనివాస్ ముల్కల, రఘునాథ్ నాగబండి, రవితేజ గాడిగి, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+