NRI News: ఎన్నారై ఫ్యామిలీ మృతి కేసులో ట్విస్ట్..
అమెరికాలో కొద్ది రోజుల క్రితం భారత సంతతికి చెందిన కుటుంబం అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. దీనిపై అక్కడి పోలీసులు విచారణ చేపట్టారు. రాకేష్ కమల్ కుటుంబ సభ్యుల మరణంపై నార్‌ఫోర్క్ డిస్ట్రిక్ అటార్నీ (డీఏ) మైఖేల్ మొరిస్సే ఆధ్వర్యంలో శవ పరీక్ష నిర్వహించారు. రాకేష్ కమలే భార్య టీనా కమల్, కుమార్తె ఆరియాను చంపినట్లు నిర్ధారించారు. ఇందుకు సంబంధించి చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ ఇచ్చిన అటాప్సీ నివేదిక ఇచ్చారు.
ఇంటికెళ్లిన రాకేష్ కమల్ మొదటగా భార్యను గన్ కాల్చి, కూతురను కూడా హత్య చేశాడని నివేదికలో పేర్కొన్నారు. భార్య, కుమార్తె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత్ తాను కూడా గన్ తో కాల్చుకుని ఆత్మహత్య పాల్పడ్డడాని వివరించారు. రాకేష్ కమల్ భార్య, కూతుర్ని ఎందుకు హత్య చేశాడు.. ఆ తర్వాత తాను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే దానిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

రాకేష్ కమల్ 2019లో 19,000 చదరపు అడుగుల విలువైన ఎస్టేట్‌ను 5మిలియన్లకు కొనుగోలు చేసినట్లు పలు జాతీయ మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. అప్పటి నుంచి ఆ కుటుంబం అదే ఎస్టేట్ లో ఉంటున్నారు. డిసెంబర్ 28న రెండు రోజులుగా రాకేష్ ఇంటి నుంచి ఎలాంటి కదలికలు, ఎవరు ఉన్నట్లు కనిపించ లేదని స్థానికులు చెప్పారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలికి చేరుకున్నారు.
పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా కమలేష్, అతని భార్య, కూతురు విగతజీవులుగా పడి ఉన్నారు. పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అయితే కమలేష్ మృత దేహం వద్ద ఎలాంటి గన్ కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి లోతుగా విచారణ జరుపుతున్నారు. ఆర్ధిక ఇబ్బందుల వల్ల రాకేష్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications