చిన్నారి శాన్వి హత్య కేసు: రఘనందన్‌కు మరణశిక్ష

2012, అక్టోబర్ 22న పెన్సిల్వేనియాలో జరిగిన ఈ దారుణంలో చిన్నారి శాన్వీ, ఆమె నానమ్మ సత్యవతిలు వారి సొంత ఇంటిలోనే దారుణ హత్యకు గురయ్యారు. రఘునందన్, ఆ తర్వాత మాట మార్చాడు. కేవలం దొంగతనం మాత్రమే చేశానని, హత్యలతో తనకు సంబంధం లేదని కోర్టుకు చెప్పాడు.
ఇద్దరు అమెరికన్ పౌరులు తనను బెదిరించి, శాన్వీ, సత్యవతిలను హత్య చేశారని చెప్పాడు. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ ఐదుగురు సభ్యుల ధర్మాసనం నుంచి ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి మారింది. కేవలం డబ్బు కోసమే రఘునందన్ జంట హత్యలకు పాల్పడ్డాడని ఈ నెల 9న కోర్టు నిర్థారించింది. కేసులో దోషిగా తేలిన రఘునందన్ కు మరణ శిక్ష విధిస్తూ కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది.












Click it and Unblock the Notifications