ఎన్నారైలకు SBI గుడ్ న్యూస్
State Bank of India: ప్రవాస భారతీయులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త వినిపించింది. అకౌంట్ తెరవడాన్ని మరింత సులభతరం చేసింది. దీనికోసం ప్రత్యేకంగా ఓ సరికొత్త ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొద్దిసేపటి కిందటే ఎస్బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి దీన్ని లాంఛనంగా ప్రారంభించారు.
అది.. ట్యాబ్- ఆధారిత డిజిటల్ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్. నాన్ రెసిడెంట్ ఎక్స్‌టర్నల్ (NRE), నాన్ రెసిడెంట్ ఆర్డినరీ (NRO) అకౌంట్లను తెరవడానికి ఈ విధానం ఉపకరిస్తుంది. భారత్ గల అన్ని ఎస్బీఐ శాఖా కార్యాలయాలతో పాటు విదేశాల్లో ఎంపిక చేసిన బ్రాంచీల్లో ఈ ప్రక్రియ ఒకేసారి అమలులోకి వచ్చింది.

డిజిటల్ టూల్స్‌ను వినియోగించడం ద్వారా ప్రవాస భారతీయులు ఎస్బీఐలో సులభంగా తమ అకౌంట్లను ఓపెన్ చేసుకోవచ్చు. డిజిటల్ ఆన్-బోర్డింగ్ ప్రక్రియ ద్వారా పేపర్ వర్క్ అవసరమే ఉండదు. డిజిటల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పద్ధతిన వేగంగా అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు ఈ విధానంలో.
విదేశాల్లో నివసిస్తోన్న భారతీయ సంతతికి చెందిన వాళ్లు (PIO) తమ బ్యాంక్‌లో అకౌంట్లను తెరవడానికి ఎస్బీఐలో ప్రత్యేకంగా ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ కేటగిరీలు అందుబాటులో ఉంటోన్న విషయం తెలిసిందే. ఈ కేటగిరీల భారీ డిమాండ్ ఉంటోంది. ప్రవాస భారతీయులు స్వదేశంలో తమ ఆర్థిక వ్యవహారాలు, పెట్టుబడులు, ఇతర లావాదేవీలను నిర్వహించడడానికి వీటిని ఎంచుకుంటోన్నారు.
ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్తగా ఈ ట్యాబ్- ఆధారిత డిజిటల్ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్‌ను ప్రారంభించినట్లు చల్లా శ్రీనివాసులు శెట్టి చెప్పారు. ఈ విషయంలో అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని, డిజిటల్ సేవలను ఉపయోగించుకుంటోన్నామని అన్నారు. ఎలాంటి పేపర్ వర్క్ చేయాల్సిన అవసరం లేదని, డిజిటల్ పద్ధితిన డాక్యుమెంటేషన్లను వెరిఫై చేస్తామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications