శాంతిభద్రతలు టీకే: ఎన్నారైల వినతి
సింగపూర్: హైదరాబాద్ శాంతిభద్రతలను తెలంగాణా రాష్ట్ర పరిధిలోనే ఉంచాలని, అలాగే భద్రాచలం అన్ని రెవిన్యు డివిజన్లను తెలంగాణాలోనే ఉంచాలని, ఏ ఇతర అంశాలు లేని తెలంగాణా ఇవ్వాలని ఎన్నారై తెరాస సింగపూర్ విభాగం కోరింది. ఈ మేరకు సోమవారం సింగపూర్‌లో జరిగిన సమావేశంలో తీర్మానమం చేసి, తమ డిమాండును ఫ్యాక్స్ ద్వారా భారత ప్రభుత్వానికి, కాంగ్రెస్, బిజెపిలకు వినతిపత్రం సమర్పించింది.
ఈ కార్యక్రమానికి ఇండియా నుండి పర్యటన నిమిత్తం విచ్చేసిన గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ జెఎసి చైర్మన్ అయాచితం శ్రీధఝర్ ముఖ్య అతిధి గా విచ్చేసి ప్రసంగించారు. దశాబ్దాలుగా అణచివేతకు గురైన, వెనుకబడిన తెలంగాణా ప్రాంతానికే ఆర్ధిక ప్యాకేజి ప్రకటించాలని శ్రీధర్ డిమాండ్ చేశారు. హైదరాబాదులో గవర్నర్‌గిరి ఇక్కడి ప్రజలకు అమోదయోగ్యం కాదని, అలాగే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి ని శంకించే విధంగా ఉందని అన్నారు .

బిజెపి కూడా పార్లమెంట్‌లో తెలంగాణ బి్లలుకు మద్దతు తెలుపుతుందని, తద్వారా 400 మంది పార్లమెంటు సభ్యుల మద్దతుతో బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమం సింగపూర్ టిఆర్ఎస్ విభాగం ఇంచార్జి కంతి రమేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో బోగ గౌతం, మహిపాల్ రెడ్డి, రమణ రెడ్డి, శ్రీనివాస్, బాలు, రంజిత్, రమేష్, సంతోష్, సాగర్, రాములు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications