H-1B Lottery: హెచ్1బీ వీసాల కోసం కొన్ని కంపెనీల మోసాలు: అమెరికా హెచ్చరిక

వాషింగ్టన్: తమ దేశానికి వీసాలపై వచ్చే ఇతర దేశాల పౌరులనుద్దేశించి అమెరికా కీలక ప్రకటన చేసింది. హెచ్-1బీ వీసా(H-1b visa)ల ఎంపిక కోసం ఉపయోగించే కంప్యూటరైజ్డ్ లాటరీ సిస్టంలో మోసాలు జరుగుతున్నట్లు గుర్తించింది. కొన్ని కంపెనీలు తమ విదేశీ ఉద్యోగులకు వీసాలు దక్కే అవకాశాలను పెంచుకునేందుకు ఈ లాటరీ వ్యవస్థను మోసగిస్తున్నట్లు తేలింది. ఈ క్రమంలో హెచ్-బీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఆధునీకరించేందుకు అమెరికా ఫెడరల్ ఏజెన్సీ సిద్ధమైంది.

H-1B వీసాలను ప్రదానం చేసే ఫెడరల్ ఏజెన్సీ యూఎస్ పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్, అదే వారి గెలుపు అవకాశాలను కృత్రిమంగా పెంచే లక్ష్యంతో ఒక వీసా దరఖాస్తుదారులను లాటరీలోకి అనేకసార్లు నమోదు చేయడానికి కొన్ని కంపెనీలు బాధ్యత వహిస్తాయని కనుగొన్నారు. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో వీసాల డిమాండ్‌ను పెంచడానికి చాలా బాధ్యత వహిస్తుంది.

H-1B Lottery

కాగా, టెక్నాలజీ కంపెనీలు ఈ వీసాలపై ఆధారపడి భారత్, చైనా వంటి దేశాల నుంచి వేలాది మంది ఉద్యోగులను నియమించుకుంటాయి. ప్రతి ఏడాది కొన్ని లక్షల మంది ఈ వీసాల కోసం దరఖాస్తు చేసుకోగా.. కంప్యూటరైజ్డ్ లాటరీ ద్వారా ఎంపిక చేసి అర్హులైన వారికి వీసాలు జారీ చేస్తుంటారు. ఈ లాటరీ ప్రక్రియలో కొన్ని కంపెనీలు మోసాలకు పాల్పడుతున్నాయని అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ గుర్తించింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొంది.

2024 ఆర్థిక సంవత్సరానికి గానూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఇటీవల చేపట్టగా.. అంతక్రితం పోలిస్తే పెద్ద మొత్తంలో దరఖాస్తులు వచ్చినట్లు USCIS గుర్తించింది. హెచ్-1బీ వీసాల కోసం ఈ ఏడాది కంప్యూటర్ జనరేటెడ్ లాటరీలో ఏకంగా 7,80,884 దరఖాస్తులు వచ్చాయి. 2023 సంవత్సరానికి ఈ సంఖ్య 4,83,927గా ఉండటం గమనార్హం. ఇక 2022లో 3,01,447, 2021లో 2,74,237 మంది దరఖాస్తు చేసుకున్నారు. సాధారణంగా రెండు సందర్భాల్లోనే ఈ సంఖ్య అమాంతం పెరుగుతుందని యూఎస్‌సీఐఎస్ పేర్కొంది.

H-1B Lottery

ఒక లబ్ధిదారు ఎక్కువసార్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు లేదా ఎక్కువ మంది దరఖాస్తులు చేసుకున్నప్పుడు ఈ సంఖ్య పెరుగుతుంది. ఈ ఏడాది 4,08,891 మంది ఒకటి కంటే ఎక్కువ సార్లు లాటరీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. గత ఏడాది కంటే ఈ సంఖ్య 1,65,180 మాత్రమే. కంపెనీలు తమ ఉద్యోగులకు వీసాలు రావాలనే దురుద్దేశంతోనే ఇలా ఎక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నాయని అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ(USCIS) వెల్లడించింది. దీనిపై తాము దర్యాప్తు ప్రారంభించినట్లు స్పష్టం చేసింది. అంతేగాక, తప్పుడు సమాచారంతో దరఖాస్తులు చేసుకునేవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+