• search

వెలిగిన తెలుగు: టీఏజీబీ ఆధ్వర్యంలో ఘనంగా దసరా, దీపావళి వేడుకలు

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  న్యూయార్క్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్(టీఏజీబీ) ఆధ్వర్యంలో బోస్టన్ తెలుగు కమ్యూనిటీసభ్యులు, ఇతర కమిటీ సభ్యులు, వాలంటీర్లు, బోస్టన్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ కమిటీ, బోర్డ్ ట్రస్టీలు ఘనంగా దసరా, దీపావళి వేడుకళను జరుపుకున్నట్లు టీఏజీబీ అధ్యక్షులు శ్రీనివాస్ బచ్చు తెలిపారు. వెయ్యిమందికి పైగా తెలుగు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు సంస్కృతి, భారతీయ సాంప్రదాయంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

  అక్టోబర్ 28న, నషౌ హైస్కూల్(సౌత్ న్యూహ్యంప్షైర్'లో జరిగిన ఈ వేడుకలు
  ఎప్పటి లాగే పండగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితం చేయటానికి టీఏజీబీ కార్యవర్గ సభ్యులు ప్రేక్షకులకి ఎన్నో చక్కని ఆహ్లాదకరమైన కార్యక్రమాలను అందించి అలరించారు. కార్యక్రమ ప్రాంగణాన్నిటీఏజీబీ అలంకరణ బృందం, సంప్రదాయ ఉత్సవ ఆకృతితో పాఠశాల ప్రవేశద్వారం, వేదికను అలంకరించి ఎంతో చక్కగా తీర్చిదిద్దారు.

  ఆకట్టుకున్న జొన్నవిత్తుల

  ఆకట్టుకున్న జొన్నవిత్తుల

  నాటి వేడుకలు డా. మేకా శేషగిరి రావు గారు జ్యోతి ప్రజ్వలన చేసిన పిదప శ్రీ శ్రీనివాస్ బచ్చు గారి స్వాగత పలుకులతో ప్రారంభమయ్యాయి. సంప్రదాయ బద్దంగా మహిళా సభ్యులు బతుకమ్మ ఆడటంతో ప్రారంభమై.. చిన్నారులు ఆలపించిన ఆధ్యాత్మిక గానామ్రుతములతో, శ్లోకములు , డాన్సు మెడ్లీల సందడులతో, శాస్త్రీయ సంగీతము , శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో, హాయిగా కడుపుబ్బా నవ్వించిన నాటకాలతో ముందుకు సాగుతూ 8 గంటల పాటు నిర్విరామంగా సాగిన నాటి కార్యక్రమంలో 40కి పైగా ప్రదర్శనలతో కళాకారులు ప్రేక్షకులను ఉత్తేజ పరిచారు.

  ప్రత్యేక ఆకర్షణలు

  ప్రత్యేక ఆకర్షణలు

  కార్యవర్గ సభ్యులు మణిమలా చలుపాది, సీతారం అమరవాది, ప్రదీప్ పెనుబోలు, రామకృష్ణ పెనుమర్తి,సత్య పరకాల, దీప్తి గోరా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి. వివిధ కళలను ప్రదర్శించిన వారికి, చదరంగ పోటీ లో గెలిచిన వారికి, ర్యాఫిల్ బహుమతి గెలిచినవారికి టీఏజీబీ కమిటీ వారు ప్రత్యేకాభినందలు తెలియ జేసారు. నాటి సాయంత్రం రూబీ బొయినపల్లి చేత తయారు చేయబడ్డ బుట్ట బొమ్మలు, వాటి తో పిల్లల చేత ప్రదర్శించబడ్డ రామాయణం చాలా ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. సభికులు అందరూ నిలబడి జయధ్వానాల తో తమ హర్షాన్ని ప్రకటించారు.

  ఆహ్లాదకరంగా సాగిన కార్యక్రమాలు..

  ఆహ్లాదకరంగా సాగిన కార్యక్రమాలు..

  శైలజా చౌదరి శిష్యులు ప్రదర్శించిన దశావతారముల న్రృత్యము, దీపావళి నృత్య రూపకం ‘నరకాశుర వధ' దసరా-దీపావళి సంబరాల కి ప్రాతినిధ్యంగా నిలిచి నాటి కార్యక్రమాలకి వన్నెతెచ్చాయి. నాటి సాయంత్రము ప్రదర్శనలతో పాటు ఆవరణలో పెట్టిన అంగడులు కూడా వచ్చినవారిని ఆకట్టుకున్నాయి. ఆ నాటి సాయంత్రము ప్యారడైస్ బిర్యాని రెస్టారెంట్ వారు, ఉడిపి రెస్టారెంట్ వారు విచ్చేసిన ఆహుతులకు చక్కని రుచికరమైన భోజనం అందించారని శ్రీనివాస్ తెలిపారు.

  ప్రత్యేక అతిధిగా విచ్చేసిన జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు కార్యక్రమం ఎంతో ఆహ్లాద కరంగా సాగింది. వారితో ఇష్టాగోష్టిలో సభికులు తెలుగు భాషగురించి అడిగిన ప్రశ్నలకు వారు ఎంతో ఓపిక తో తమదైన శైలి లో సంశయాలు తీర్చారు. ఆయన అధిక్షేప కవితా బాణి, అస్తవ్యస్త వ్యవస్థకు చికిత్స. ఆయన ప్రవచనాలు భక్తి భావనా సోపానాలు. విషయం ఏదైనా, దానిని హాస్య, వ్యంగ్య, చమత్కార చాతురితో వివరించే తీరు, ఆహుతులకి మానసికోల్లాసాన్ని, ఆలోచనామృతాన్ని అందించాయి. మోహన్ నన్నపనేని, శశికంత్ వల్లీపల్లి , జొన్నవిత్తుల రామలింగేశ్వర రావుని సత్కరించారు.

  విజయవంతం..

  విజయవంతం..

  ఎంతో కృషిని, సమయాన్ని వెచ్చించి నాటి వేడుకలను విజయవంతం చేసిన ప్రదర్సకులకు, వారి తల్లితండ్రులకు , విచ్చేసిన ప్రేక్షకులకు, వాలంటీర్లకు, టీఏజీబీ కార్యవర్గ సభ్యులకు, దాతలకు టీఏజీబీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ బచ్చు ప్రత్యేక అభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమానికి విజయ్ పంచాక్షరి, లత పంచాక్షరి, రవికాంత్ బచ్చు, మహతి మొదలి, మనోజ్ ఇరువూరి, కిరణ్మై చతుర్వేదుల, రమేష్ దడిగల వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. యువ వ్యాఖ్యాతలైన సాయి వల్లూరు, స్మేరా గోరా తమ చక్కని తెలుగు వాక్చాతుర్యంతో వచ్చిన ప్రేక్షకుల మన్సులు దోచుకున్నారు. చివరిగా టీఏజీబీ సెక్రటరీ ప్రదీప్ పెనుబోలు ప్రదర్శకులకు, వాలంటీరులకు, టీఏజీబీ కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. భారత జాతీయ గీతం పాడటంతో నాటి దసరా-దీపావళి వేడుకలు విజయవంతంగా ముగిశాయి.

  English summary
  On behalf of Telugu Association of Greater Boston (TAGB), I am proud toannounce that our Boston Telugu community members, Various Committee members, Youth and Volunteers, Executive Committee and Board of Trustees in Greater Boston area have celebrated our "Dasara-Deepawali-2017" event over the weekend.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more