టీఏజీబీ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు(పిక్చర్స్)
న్యూయార్క్: తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ బోస్టన్ అమెరికా (టీఏజీబీ) నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో 'ఉగాది వేడుకలు 2016' ఏప్రిల్ 16న బర్లింగటన్‌లోని బర్లింగటన్ హై స్కూల్లో ఘనంగా జరిగాయి. ప్రతీ ఏడు లాగానే ఈ ఏడు కూడా 800 మందికి పైగా ఆహుతులతో వేడుకలు ఘనంగా జరిగాయి.
ఉగాది పచ్చడి, పానకాలతో స్వాగతిస్తూ ఉగాది వేడుకలు మొదలయ్యాయి.
టీఏజీబీ అలంకరణల బృందం ఎంతో శ్రద్ధతో చేసిన అలంకరణలు, స్టేజి, హాల్, ద్వారాలను వర్ణభరితం చేశాయి. తెలుగు సాంప్రదాయిక దుస్తుల్లో విచ్చేసిన వాళ్ళంతా పండుగని మరింత శోభాయమానం చేశారు. సాంస్కృతిక కార్యదర్శి రమణ దుగ్గరాజు సదస్సుని ఉద్దేశించి మాట్లాడి కార్యక్రమాలకి తెర తీశారు.
సుమారు 7 గంటల పాటు నిర్విరామంగా 250 కళాకారులతో 52 ప్రదర్శనలు ప్రేక్షకుల చప్పట్ల మధ్య ఉత్సాహంగా సాగిపోయాయి. శ్రీ గణేశ పంచరత్న కీర్తనతో మొదలై, పాటలు, వాద్య నాదనలు, స్కిట్స్, క్లాసికల్, లలిత సంగీత, జానపద నృత్య విభావరులు, నాటకాలతో రంగస్థలి హోరెత్తింది. విద్యార్థులు చేసిన ప్రదర్శనలు, తల్లితండ్రులు, టీచర్స్ నేర్పిన విలువలని చాటాయి.
లాస్య డాన్సు స్కూల్ నుండి, కూచిపూడి డాన్సు స్కూల్ , తరంగిణి, ఆర్య స్కూల్స్ నుండి యింకా చాలా మంది కోరియోగ్రాఫర్స్ తీర్చి దిద్దిన కార్యక్రమాలు అలరించాయి. లయతో , తాళంతో, పదవిన్యాసంతో, అపురూప భంగిమలతో, చేసిన ప్రదర్శనలు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి. నాట్య సమ్మేళనం వారి నూతన నాట్య రీతి అందర్నీ ఆకట్టుకొంది. కూచిపూడి, భరతనాట్యం, మణిపురి, కథక్, నాట్య రీతులు అందాన్నీ, అనందాన్ని పంచాయి.
నవీనంగా "మోడరన్ మయసభ" తో, శ్రీయుతులు శ్రీనివాస్ బచ్చు భవిష్యత్కాల అధ్యక్షులుగా, మణిమాల చలపాది కార్యదర్శిగా , ప్రదీప్ రెడ్డి పెనుబోలు కోశాధికారిగా, రమణ దుగ్గరాజు సాంస్కృతిక కార్యదర్శిగా, సురేందర్ మాదాది, సంయుక్త కార్యదర్శిగా, సీతారాం అమరవాది సంయుక్త కోశాధికారిగా, శ్రీ చంద్ర తాళ్లూరి (అధ్యక్షులు), చేసిన నూతన కార్యవర్గ సభ్యుల పరిచయం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది.
నూతన కార్యవర్గ సభ్యులు చేసిన ప్రదర్శన, రచన, అన్నీ, వారు గంటల తరబడి చేసిన ప్రాక్టిసుని రుజువు చేశాయి.ఇందులో దుర్యోధనుడు టీఏజీబీ వారి ఉగాది వేడుకలకి ఆహ్వానాన్ని అంగీకరించి వచ్చి సభ్యుల పట్ల తలబిరుసుగా ప్రవర్తిస్తే, అధ్యక్షులు చంద్ర తాళ్లూరి తన గంభీర సంభాషణలతో ప్రవేశించి, సభ్యులనీ, కార్యవర్గాన్నీ, అతిథులనీ సమర్థించి చూపుతారు.
బోస్టన్ భీష్మగా పేరుపొందిన మోహన్ నన్నపనేనిని, సంస్థకి చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ సత్కరించిన కార్యవర్గం అందరి మన్ననలు పొందింది. 'మోడరన్ మయసభ' నాటికకు దర్సకత్వం వహించి, అద్భుతమైన డైలాగ్స్ రాసిన పద్మజ బాలను, దుర్యోధనుడిగా నటించిన అరుణ్ ముల్పూర్నును, శకునిగా నటించిన రమేశ్ మంథాను కార్యవర్గ సభ్యులు సత్కరించారు. కన్యా కుమారి, లావణ్య కంచెర్లల లలిత సంగీతం, సీనియర్ డాన్సర్ లక్ష్మి రాజ్ భరత నాట్యం అందరినీ అలరించాయి.
భరద్వాజ, నీహారికల సినీ గేయాలు అందరినీ ఆకట్టుకొన్నాయి. 'న్యూ ఇంగ్లాండ్ మామ్స్' వారి ఆఖరి ప్రదర్శన అహో అనిపించింది. బిగ్ హెల్ప్ అధ్యక్షులు చాంద్ పాషా "మాథ్ బీ", కుకీ, ఫోటోగ్రఫీ పోటీ విజేతలకి బహుమతులు ఇచ్చారు. అసంఖ్యాకంగా సభ్యులు, తమ సమయాన్ని స్వచ్చందంగా గా వెచ్చించారు. ఈ వేడుకలలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ సంస్థకి ఆర్ధికంగా తోడ్పడ్డాయి. వుబర్న్ వారి గోదావరి రెస్టారెంట్, వచ్చిన సభ్యులందరికీ చక్కని భోజనం అందించింది.
మాధవి సీరాం , కిరణ్మయి చతుర్వేదుల, శ్రేయాస్ చతుర్వేదుల, సంజన సీరామ్, మాధవి కమ్మ, దీప్తి గోరా కార్యక్రమ నిర్వహణలో ముఖ్య పాత్ర పోషించారు. సంస్థతో చాలా కాలంగా అనుబంధం ఉన్నడాక్టర్ హరిబాబు ముద్దన గారిని, బోర్డు అఫ్ ట్రస్టీస్ చైర్‌గా ఎలక్షన్ కమిటీ తెలిపింది. డాక్టర్ ముద్దనని సర్వ జనులు ఆమోదించారు. శ్రీనివాస్ కొల్లిపర, రమేష్ బాబు తల్లం, మూర్తి కన్నెగంటి, రాజ ఎస్ చిలకమర్రి, శంకర్ మగపు,కృష్ణమూర్తి నాయుడు పోదిపిరెడ్డిలను బోర్డు అఫ్ ట్రస్టీకి ఆమోదించారు.
అధ్యక్షులు తాళ్లూరి, సభ్యులందరికీ, నవీనమైన, నాణ్యమైన కార్యక్రమాలు చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలో జరుగనున్న బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ఆటల పోటీలలో అందరూ పాల్గొనాలని పిలుపు నిచ్చారు. అధ్యక్షులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. సంస్థ సెక్రటరీ మణిమాల చలుపాది వందన సమర్పణ, జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది.

ఉగాది సంబరాలు
తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ బోస్టన్ అమెరికా (టీఏజీబీ) నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో ‘ఉగాది వేడుకలు 2016' ఏప్రిల్ 16న బర్లింగటన్‌లోని బర్లింగటన్ హై స్కూల్లో ఘనంగా జరిగాయి.

ఉగాది సంబరాలు
ప్రతీ ఏడు లాగానే ఈ ఏడు కూడా 800 మందికి పైగా ఆహుతులతో వేడుకలు ఘనంగా జరిగాయి. ఉగాది పచ్చడి, పానకాలతో స్వాగతిస్తూ ఉగాది వేడుకలు మొదలయ్యాయి.

ఉగాది సంబరాలు
క్రొత్త సంవత్సరంలో కలిగే అన్నిరకాల అనుభవాలకు, అనుభూతులకు తయారుగా ఉండమని సూచనగా షడ్రుచుల ఉగాది పచ్చడి చేసుకుంటాం.

ఉగాది సంబరాలు
వేప పువ్వు, క్రొత్త చింతపండు,క్రొత్త బెల్లం, ఉప్పు, కారం, పచ్చి మామిడి ముక్కలతో. చేదు, పులుపు,తీపి, ఉప్పు, కారం, వగరు రుచులు జీవితంలో కలిగే, విషాదం,సంతోషం, జుగుప్స, భయం, కోపం,విభ్రాంతి ఆదిగా భావనలు సూచిస్తాయి.

ఉగాది సంబరాలు
టీఏజీబీ అలంకరణల బృందం ఎంతో శ్రద్ధతో చేసిన అలంకరణలు, స్టేజి, హాల్, ద్వారాలను వర్ణభరితం చేశాయి. తెలుగు సాంప్రదాయిక దుస్తుల్లో విచ్చేసిన వాళ్ళంతా పండుగని మరింత శోభాయమానం చేశారు.

ఉగాది సంబరాలు
సాంస్కృతిక కార్యదర్శి రమణ దుగ్గరాజు సదస్సుని ఉద్దేశించి మాట్లాడి కార్యక్రమాలకి తెర తీశారు.

ఉగాది సంబరాలు
సుమారు 7 గంటల పాటు నిర్విరామంగా 250 కళాకారులతో 52 ప్రదర్శనలు ప్రేక్షకుల చప్పట్ల మధ్య ఉత్సాహంగా సాగిపోయాయి.

ఉగాది సంబరాలు
శ్రీ గణేశ పంచరత్న కీర్తనతో మొదలై, పాటలు, వాద్య నాదనలు, స్కిట్స్, క్లాసికల్, లలిత సంగీత, జానపద నృత్య విభావరులు, నాటకాలతో రంగస్థలి హోరెత్తింది. విద్యార్థులు చేసిన ప్రదర్శనలు, తల్లితండ్రులు, టీచర్స్ నేర్పిన విలువలని చాటాయి.












Click it and Unblock the Notifications