జయలలిత కేసు వదిలేయండి: తమిళ్ ఫర్ ఒబామా
న్యూయార్క్: తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత అక్రమాస్తుల కేసు విషయంపై సుప్రీంలో అప్పీలు చెయ్యరాదని, ఈ కేసును ఇంతటితో వదిలి పెట్టాలని విదేశాలలోని తమిళ సంఘాల నాయకులు, ఎన్ఆర్ఐలు కర్ణాటక ప్రభుత్వానికి మనవి చేస్తున్నారు.
సోమవారం కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పలువురు తమిళ సోదరులు అనేక విధాలుగా స్పందిస్తున్నారు. తమిళ్ ఫర్ ఒబామా అనే సంఘం ఎన్ఆర్ఐలు మంగళవారం వారి వెబ్ సైట్ లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఇదే విషయంపై మనవి చేస్తూ లేఖలు వ్రాశారు.
జయలలిత అక్రమాస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు ఏకసభ్య బెంచ్ న్యాయమూర్తి కుమారస్వామి ఇప్పటికే క్లీన్ చిట్ ఇచ్చారని, కేసు కొట్టివేశారని గుర్తు చేశారు. ఇప్పుడు సుప్రీం కోర్టులో అప్పీలు చేస్తే కేసు మళ్లి మొదటికి వస్తుందని, తరువాత అందరికి ఇబ్బందే అన్నారు.

తమిళనాడులో ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జయలలిత పలు అభివృద్ది పనులు చేపట్టారని, పేదలను ఆదుకోవడానికి అనేక కొత్త పథకాలు అమలు చేశారని వారు గుర్తు చేశారు. అదే విధంగా శ్రీలంకలోని తమిళ ప్రజలను రక్షించడం జయలలితకు ఒక్కరికే సాధ్యం అవుతుందని చెప్పారు.
ఇప్పటికే జయలలిత అనవసరంగా జైలు శిక్ష అనుభవించారని ఈ కేసు ఇంతటితో వదిలి పెట్టడం చాల మంచిదని అమెరికా తమిళ సంఘాలు అంటున్నాయి. అయితే కర్ణాటక ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై ఏ విదంగాను స్పందించలేదు.












Click it and Unblock the Notifications