అమ్మ భాష సేవలో అంధ మేధావులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆర్. మల్లిఖార్జున రావు మాట్లాడారు. ప్రతి నెలా వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నెలనెలా తెలుగు వెలుగు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డా.ప్రసాద్ తోటకూర ఆధ్వర్యంలో "జ్ఞాననేత్రులు - తెలుగుదివ్వెలు" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంధులలో ఉన్నది దృష్టి లోపం కాదని, వారికి దూరదృష్టి ఉందన్నారు. భగవంతుడు అన్నీ ఇచ్చినా ఇంకా ఏదో లేదనుకుంటూ తమ జీవితాలను అంధకారంలో నెట్టుకొంటున్న అసంతృప్తివాదులకు, నిరాశావాదులకు వీరి జీవితాలు స్ఫూర్తిగా నిలవాలన్నారు. పట్టుదల, ఆత్మస్థైర్యం, కృషి అనే లక్షణాలను ఆయుధాలుగా చేసుకొని జీవన పోరాటం చేస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్న ధీరోదాత్తుల జీవితాలు అందరికీ కనువిప్పు కావాలన్నారు.
కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆర్. మల్లిఖార్జున రావు మాట్లాడారు. ప్రతి నెలా వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు. అంధ మేధావులతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చాలా ప్రత్యేకమైందని ప్రశంసించారు. విశిష్ట అతిథులుగా ఆచార్య మన్నవ సత్యనారాయణ, ఆచార్య జక్కంపూడి మునిరత్నం నాయుడు, డా. బొల్లా జ్యోత్స్న ఫణిజ, శాస్త్రీయ సంగీత విద్వాంసులు డి.వి మోహన కృష్ణ, అపార జ్ఞాపకశక్తి సంపన్నులు, వ్యక్తిత్వ వికాస శిక్షకులు షాకీర్ మొహమ్మద్, సత్యవాడ సోదరీమణులు - సత్యవాడ రఘునాథమ్మ, సత్యవాడ సూర్యకుమారి, డా. బెంకి రాఘవేందర్ రెడ్డి, హరీష్ కుమార్, రచయిత డా. చిన్నావుల వేంకట రాజారెడ్డి, నెల్లూరుకు చెందిన కవి మోపూరు పెంచల నరసింహం, సింగరాయకొండకు చెందిన ఉపాధ్యాయిని పెండ్యాల గాయత్రి, రచయిత టింగిరికార్ వెంకటేశ్ పాల్గొన్నారు.













Click it and Unblock the Notifications