Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఘనంగా లండన్ బోనాల వేడుకలు: ముఖ్య అతిథిల్లో ఒకరిగా బిత్తిరి సత్తి..

తెలంగాణ ప్రభుత్వం నుండి కానీ వ్యక్తిగతంగా నానుండి కానీ ఏదైనా సహాయసహకారాలు కావాలంటే నన్ను సంప్రదించవచ్చని తెలిపారు.

లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌ బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. టాక్ మహిళా నాయకురాలుసుప్రజ పులుసు వక్తగా జరిగిన సంబరాలకు యూకే నలుమూలల నుండిసుమారు 800కి పైగాతెలంగాణ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

ఈ వేడుకలకు తెలంగాణారాష్ట్రం నుండి స్పెషల్ రెప్రెసెంటేటివ్ అఫ్ తెలంగాణ రామచంద్రుతేజావత్ గారు,తీన్మార్వార్తలబిత్తిరి సత్తి, ఫస్ట్ సెక్రటరీ అఫ్ ఇండియన్ కమిషన్ విజయ్ వసంతన్ ముఖ్య అతిధులుగా హాజరవడం విశేషం. స్వదేశంలో జరుపుకున్నట్టు సాంప్రదాయ బద్దంగా పూజలునిర్వహించి, లండన్ వీదుల్లో తొట్టెల ఊరేగింపు లష్కర్ బోనాలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రవాసతెలంగాణ బిడ్డలనే కాకుండా స్తానికులని కూడా ముగ్దులని చేసింది.

 tauk london bonalu celebrations 2017

బోనాలఊరేగింపు తరువాత ఏర్పాటు చేసిన వేడుకల సభలో ముందుగా సంస్థ అద్యక్షురాలు పవిత్రరెడ్డి కంది మాట్లాడుతూ టాక్ సంస్థ
ద్వారా జరుపుతున్న మొట్టమొదటి బోనాల ఉత్సవాలైనప్పటికీ గతంలో ఎన్నడూలేని విధంగా విజవంతం కావడం చాలా
ఆనందంగా ఉందని, ఆడబిడ్డలందరు బోనాలతో లండన్ వీధుల్లో ఊరేగింపు చేయడం ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. టాక్ సంస్థని, అలాగేబోనాల జాతర వేడుకల పోస్టర్ఆవిష్కరించే కాకుండా అన్ని సందర్భాల్లో సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న నిజామాబాదు ఎంపీ కవిత గారికి కృతఙ్ఞతలు తెలిపారు.

టాక్ వ్యవస్థాపకుడు మరియుఎన్నారై టి. ఆర్.యస్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ ఈ తెలంగాణ అసోసియేషన్అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి మరియు రాబోయే రోజులో సంస్థ చేయబోయే వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. తెలంగాణ ప్రజల కోసం, ప్రపంచంలో ఉన్న తెలంగాణాబిడ్డల కోసం చేస్తున్న కార్యక్రమాలగురించి వివరించి, అందరు ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

 tauk london bonalu celebrations 2017

అలాగే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల గురించి, బంగారు తెలంగాణలో ఎన్నారైలపాత్ర గురించి అందరికి గుర్తు చేశారు. అలాగే బోనాల వేడుకైనప్పటికీ, బాధ్యత గల తెలంగాణ బిడ్డలుగామనందరం చేనేతకు చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని, హాజరైన అతిథులందరితో " We Pledge to #SupportWeavers #WearHnadloom" అని ప్రతిజ్ఞచేయించారు.

మన రాష్త్ర మంత్రి కేటీఆర్ గారు పిలుపునిచ్చినట్టు మనంతా కూడా ఒక రోజుచేనేత దుస్తులు ధరించి వారిని ప్రోత్సహించాలని కోరారు. ముఖ్య అతిధులు ముందుగా రామచంద్రు తేజావత్ గారు మాట్లాడుతూ టాక్ చేస్తున్నబోనాల పండుగలో కుటుంబ సమేతంగా పాలుపంచుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని, విదేశాల్లో ఉంటూ మన సంస్కృత సంప్రదాయాలని విశ్యవ్యాప్తం చేస్తున్న తీరు ఎంత స్ఫూర్తిగాఉందని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం నుండి కానీ వ్యక్తిగతంగా నానుండి కానీ ఏదైనా సహాయసహకారాలు కావాలంటే నన్ను సంప్రదించవచ్చని తెలిపారు. ఇండియన్ కమీషన్ ప్రతినిధి విజయ్ వసంత మాట్లాడుతూ బోనాలు వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్తున్న తీరుని ప్రశంసించారు.

ఒక పక్క వ్యక్తిగతంగా ఇక్కడున్నబిడ్డలు రోజు వారి పనుల్లో బిజీగా ఉన్నప్పటికి, బాద్యతగల తెలంగాణా బిడ్డలుగా ఆనాడు ఉద్యమంలో నేడు పునర్నిర్మాణంలో పోషిస్తున్న పాత్ర ఎందరికో ఆదర్శనంగా ఉందని తెలిపారు. అడ్వైజరీఇంచార్జి గోపాల్ మేకల సంస్థ విధివిధానాలను సభకు వివరించారు.

ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి స్వాతి బుడగడం మాట్లాడుతూ తొట్టెల ఊరేగింపు యొక్క ప్రాముఖ్యత మరియు టాక్ సంస్థ తెలంగాణ సంస్కృతి ని యుకె నలుమూలఏ విధంగా విస్తరించబోతుందో ఉన్న ప్రణాళికను సభాముఖంగా తెలియచేసినారు.ఈ బోనాల వేడుకల్లోబాగస్వామ్యులైన ఇతరసంస్థల ప్రతినిధులకుకృతజ్ఞతలు తెలిపి జ్ఞాపిక అందజేశారు.

సంప్రదాయ తెలంగాణా వంటకాలతో పండగ భోజనం సొంత ఇంటిని తలిపించిందని హాజరైన వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన బిత్తిరి సత్తి తన మాటలతో పాటలతోప్రేక్షకులను అలరింపచేశారు. టాక్ ప్రతినిధులురామచంద్రు తేజావత్ గారు, ఇండియన్ హైకమీషన్ ప్రతినిధివిజయ్ వసంత గారు మరియు తీన్మార్ వార్తల బిత్తిరి సత్తి గారిని ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందచేశారు.

తెలంగాణ చిన్నారులు,కమిటీ మహిళా విభాగంఎగ్జిక్యూటివ్ సభ్యులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించింది. అలాగేసాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సంస్థ ఎగ్జిక్యూటివ్ టీం జ్ఞాపికలతోప్రశంశించారు.

టాక్ సభ్యులు అశోక్ దూసరి,నవీన్ రెడ్డి,రత్నాకర్ కడుదుల ,విక్రమ్ రెడ్డి , వెంకట్ రెడ్డి దొంతుల ,శ్రీకాంత్ జిల్లా, స్వాతి బుడగం ఆద్వర్యంలో జరిగిన బోనాలజాతర ఇంతటి విజయం సాదించడం సంతోషంగా ఉందని కమిటీసభ్యులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకుడుఅనిల్ కూర్మాచలం, అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, అడ్వైసరీ చైర్మన్
గోపాల్మేకల, సభ్యులు అశోక్ దూసరి, నవీన్ రెడ్డి,రత్నాకర్ కడుదుల, శ్రీధర్ రావు, శ్రీకాంత్ జెల్ల, శ్రీకాంత్ పెద్దిరాజు,స్వాతి బుడగం , సంజయ్సేరు, సత్య పింగిళి, సత్యచిలుముల,సత్యం కంది, శశిధర్ రెడ్డి, స్నేహ రెడ్డి, శ్రీనివాస్ మేకల, సుమ దేవి, సుప్రజ,

అపర్ణ , సురేష్ బుడగం, వెంకట్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, ప్రవళిక, కిరీటి, జాహ్నవి, వేణు రెడ్డి, నక్కిరెడ్డి, ప్రియాంక, శ్రీనివాస్, భరత్, రాజేష్వాకా, వెంకీ, రవి కిరణ్, గణేష్, హరి, హరిదీప్, మధుసూదన్ రెడ్డి, మల్ రెడ్డి, మట్టారెడ్డి, రాజేష్ వర్మ, రాకేష్ పటేల్, రంజిత్, రవి ప్రదీప్, రవిరతినేని, నరేందర్, నవీన్ భువనగిరి, తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+