చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన టీడీపీ కువైట్
కువైట్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 71వ జన్మదిన వేడుకలను తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో జూమ్ కాల్ ద్వారా నిర్వహించారు.
ప్రముఖ నాటక రంగ ప్రముఖులు గుమ్మడి గోపాలకృష్ణ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సేక్రటరీ నాదెండ్ల బ్రహ్మం చౌదరి, ప్రముఖ కదిరి తెలుగుదేశం నాయకులు బండారు మనోహర్ నాయుడు, మచిలీపట్నం పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు స్వర్ణలత, ప్రముఖ కవి అయినాల మల్లేశ్వర రావు, ప్రముఖ గాయకుడు ప్రవీణ్ కుమార్, ఇండియా, అమెరికా, లండన్, సౌదీ అరేబియ, ఖతారు, బహరైన్, దుబాయ్, ఓమన్, బ్యాంకాక్ దేశాలలోని పార్టీ నాయకులు, చంద్రబాబు అభిమానులు పాల్గొన్నారు.

పూర్తిగా వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి అందరూ చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఏకదాటిన 4 గంటలకు పైగా జరిగిన ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా జరిగింది. ఇందులో పాల్గొన్న ముఖ్య అతిథులు, వివిధ దేశాలలోని నాయకులు అందరూ మాట్లాడారు.

చంద్రబాబు మరల ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని, అలాగే మన భావితరాలకు వేసిన పునాదులను మరిత ప్రతిష్టం చేయాలని కోరారు. అలాగే అమరావతి లాంటి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం, పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్టు కంప్లీట్ అవాలన్నా మరల ఆయనే ముఖ్యమంతి అవ్వాలని మనసారా కోరుతూ ఆయన ఆయురారోగ్యాలలతో చిరకాలం జీవించాలని అందరు దేవుళ్ళను ప్రార్దించారు.













Click it and Unblock the Notifications