టీపీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు(పిక్చర్స్)

Subscribe to Oneindia Telugu

లండన్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ సెల్ ఆధ్వర్యంలో లండన్, న్యూజెర్సీ , సిడ్నీలలో ఘనం గా నిర్హహించారు. 'సోనియామ్మా వందనం - తెలంగాణ సంబరం' కార్యక్రమం పేరుతో సోనియా గాంధీకి తెలంగాణ ఇచ్చినందుకు తెలంగాణ ప్రజల తరపున
వందన కార్క్యక్రమాన్ని సూర్యుడు అస్తమించని తెలంగాణ సంబరం పేరున వివిధ దేశాల్లో నిర్వహించారు.

లండన్‌లో..

లండన్‌లో..

లండన్‌లో ఆదివారం నాడు తెలంగాణ ఆవిర్భావ సంబరాలు జరిపారు. మొదట దేశ స్వాతంత్ర్య ఉద్యమ ప్రముఖులకు పుష్ప గుచ్చాలు సమర్పించి,
కొవ్వొత్తులతో తెలంగాణా అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్య అతిథులుగా వచ్చిన అడ్వైసర్లు డాకూర్ పవన్ కుమార్ రెడ్డి , కమలాకర్ రావు ఓరుగంటిలు సోనియా గాంధీ చిత్ర పటాన్ని ఆవిష్కరించారు.

సంబరాలు

సంబరాలు

అనంతరం తెలంగాణ కేక్ కట్ చేసి సంబరాలు ప్రారంభించారు. సభాధ్యక్షులుగా
టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కో-ఆర్డినేటర్, యూకే కన్వీనర్ గంప వేణుగోపాల్ వ్యవహరించి తెలంగాణ సాధనలో నాటి కాంగ్రెస్ ఎంపీల కృషిని తెలిపారు. దయాకర్ పవన్ కుమార్ మాట్లాడుతూ.. భౌగోళిక తెలంగాణనే సాధించామని అసలైన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరుగుతుందని 2019లో అన్ని
వర్గాలు కాంగ్రెస్‌కే ఓటు వేస్తామని నిర్ధారించుకున్నారని తెలిపారు .

కమల్ రావు మాట్లాడుతూ.. సాధించి తెచ్చుకున్న తెలంగాణ దశ దిశ లేకుండా
ఉందని ఎన్ఆర్ఐలు కీలక పాత్ర పోషించాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో
కో-కన్వీనర్లు రంగుల సుధాకర్ , రామ్మోహన్ రెడ్డి ,రాకేష్, సభ్యులుశ్రీకత్ రెడ్డి ,శ్రీధర్
రెడ్డి, నర్శింహా రెడ్డి, ప్రవీణ్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి , హితేష్, జాంగా రెడ్డి ,శ్రీధర్ బాబు, మధు
గట్ట ,పాల్గొన్నారు .

న్యూజెర్సీ, అమెరికా..

న్యూజెర్సీ, అమెరికా..

సోనియమ్మా వందనం-తెలంగాణ సంబరం పేరున తెలంగాణలో చారిటీ కార్యక్రమాలను నిర్వహించారు అర్ముర్ ,మిర్యాలగూడ,నారాయణ పేటలలో
పలు సేవ కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ మిత్రులకు స్వీట్స్ పండ్ల బుట్టలు పంపి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కన్వీనర్ రాయ దాస్ కో-కన్వీనర్లు స్రవంత్ పోరెడ్డి, కృష్ణ కిశోరె రెడ్డి ల ఆధ్వర్యంలో జరిగినవి.

ఆస్ట్రేలియా -సిడ్నీ..

ఆస్ట్రేలియా -సిడ్నీ..

మేకా రాజశేఖర్ రెడ్డి, దేవి ప్రసాద్ రెడ్డిల ఆధ్వర్యంలో సిడ్నీ లో పలు చోట్ల
సోనియమ్మ పేరున పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి పండ్ల పంపిణి కార్యక్రమం నిర్వహించారు . జర్చర్ల లో ప్రాధమిక పాఠశాలలో విద్యార్థుల అవసర
నిమిత్తం వాటర్ ఫిల్టర్ ఏర్పాటు కార్యక్రమం ప్రారంభించారు .

సిడ్నీ తెలంగాణ సంబరాలకు వచ్చిన కరీం నగర్ ఎంపీ బి వినోద్ కుమార్
గారికి ధర్నాచౌక్ ఎత్తివేతను విరమించుకోవాలని ,పెరేడ్ గ్రౌండ్‌లో ఎలాంటి
నిర్మాణాలు చేబట్ట వద్దని వినతి పత్రం సమర్పించారు. ఈ మేరకు వివరాలను టీపీసీసీ ఎన్నారై సెల్ కో-ఆర్డినేటర్ గంప వేణుగోపాల్ తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
telangana formation day celebrations held by TPCC in London, new jersey and sydney.
Please Wait while comments are loading...