మెల్బోర్న్‌లో ఘనంగా తెలంగాణ స్ఫూర్తి సభ(పిక్చర్స్)

సిడ్నీ: టిఆర్ఎస్ పార్టీ ఎన్నారై ఆస్ట్రేలియా శాఖ, ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ టిఆర్ఎస్(ఓఎఫ్‌టీఆర్ఎస్) ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంత కర్త దివంగత ప్రొఫెసర్ జయశంకర్ ఐదవ వర్ధంతి సందర్భంగా 'తెలంగాణా స్పూర్తి సభ'ను మెల్బోర్న్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో తెలంగాణ ప్రవాసులు, టిఆర్ఎస్ కార్యకర్తలతో పాటు మెల్బోర్న్‌లో నివసిస్తున్న ఆంధ్రాకు చెందిన కొందరు టిఆర్ఎస్ మద్దతుదారులు పాల్గొన్నారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ టిఆర్ఎస్ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల అధ్యక్షతన ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ముందుగా
జయశంకర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ అమరవీరులను , జయశంకర్ సార్‌ను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.

అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల మాట్లాడుతూ.. తెలంగాణ భావజాల వ్యాప్తిలో జయశంకర్ పాత్ర గొప్పదని, వారు చివరి వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమై పని చేశారని, ప్రతి వ్యక్తి జీవితంలో ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ జెండా మోసే అవకాశం కలిగించిన సీఎం కెసిఆర్‌కి, ఇటీవల
ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చి తమను ప్రోత్సహించిన ఎంపీ కవితకు, నేడు ముఖ్య అతిథిగా వచ్చి తమను ప్రోత్సహిస్తున్న నిరంజన్ రెడ్డికి కృతజ్ఞతలు
తెలిపారు.

అధికారిక శాఖ ఏర్పాటు జరిగిన తర్వాత జరుగుతున్న మొదటి కార్యక్రమమైనపట్టికీ భారీ సంఖ్య లో తెలంగాణా బిడ్డలు, పార్టీ కార్యకర్తలు హాజరై విజయవంతం చేయడం పట్ల ప్రవాస బిడ్డల మనసుల్లో కేసీఆర్ నాయకత్వం పట్ల ఉన్న అభిమానానికి ఇది నిదర్శమని తెలిపారు.

ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ టిఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ భవిష్యత్తు కార్యక్రమాలు, విధి విధానాల గురించి సభకు వివరించారు. గతంలో తెలిపినట్టు మరొక్కసారి ఆసక్తి గల టిఆర్ఎస్ పార్టీ అభిమానులకు, మద్దతుదారులు ముందుకు వచ్చి అధికారిక శాఖలో పాల్గొని మనమందరం కలిసి పార్టీకి మన వంతు బాధ్య త నిర్వహిద్దామని పిలుపునిచ్చారు.

ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. టిఆర్ఎస్ పార్టీకి, జయశంకర్‌కి ఉన్న అనుబంధం గురించి, అలాగే వ్యక్తిగతంగా వారికి ఉన్న సాన్నిహిత్యం గురించి సభకు వివరించారు. తెలంగాణ సమాజానికి ముఖ్యంగా తెలంగాణా రాష్ట్ర సాధనకు జయశంకర్ చేసిన కృషి చాలా గొప్పదని తెలిపారు.

ప్రస్తుతం తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణా రాష్ట్రాన్ని బంగారు తెలంగాణా వైపు తీసుకెళ్తున్న తీరుని, వివిధ రంగాల్లో నేటి వరకు జరిగిన, బావిష్యత్తులో జరగబోయే అభివృద్ది గురించి సభకు వివరించారు. ఎన్నారైలుగా పార్టీకి చేస్తున్న సేవను అభినందించి, అన్ని సమయాల్లో అందుబాటులో ఉండి
కావలసిన సహాయం అందిస్తానని తెలిపారు.

తననీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఎన్ఆర్ఐ ఓఎఫ్‌టిఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షులు నాగేందర్ రెడ్డి కాసర్ల, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ నిరంజన్ రెడ్డి ఓఎఫ్‌టిఆర్ఎస్‌కు చెందిన 100కి పైగా ఎన్ టి‌ఆర్‌ఎస్ కార్యకర్తల్ని కండువాలు కప్పి సత్కరించారు.

అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల తో పాటు సంస్థ ముఖ్య నాయకులు అనిల్ బైరెడ్డి, డా. అనిల్ రావు చీటీ నిరంజన్ రెడ్డిని శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగించి, ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ అధ్యక్షుడు నాగేందర్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు నాగేందర్ కాసర్లతో పాటు ముఖ్య నాయకులు అనిల్ బైరెడ్డి, అనిల్ రావు చీటీ, అర్జున్ చల్లగుల్ల, అమర్ రావు చీటీ, సత్యం రావు, ప్రకాష్ సూరాపనేని, రోహిత్, సనిల్, ఉదయ్ కల్వకుంట్ల, సాయి ఉప్పు, శ్రీనివాస్ చింతల, అభిమన్యు సభ్యులు అవినాష్, రాఘవేందర్,వెంకట్, హేమంత్,కిరణ్,
ప్రవీణ్,అవినాష్ ,కృష్ణ ,కళ్యాణ్, వెంకట్,అటై (ఏటిఏఐ) ప్రతినిధులు ప్రవీణ్ దేశం, రాజ్ ఉల్పల,శ్రీనివాస్ కర్ర ,పుల్లా రెడ్డి బద్దం,సతీష్ పాటి, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ స్ఫూర్తి సభ

తెలంగాణ స్ఫూర్తి సభ

టిఆర్ఎస్ పార్టీ ఎన్నారై ఆస్ట్రేలియా శాఖ, ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ టిఆర్ఎస్(ఓఎఫ్‌టీఆర్ఎస్) ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంత కర్త దివంగత ప్రొఫెసర్ జయశంకర్ ఐదవ వర్ధంతి సందర్భంగా ‘తెలంగాణా స్పూర్తి సభ'ను మెల్బోర్న్‌లో ఘనంగా నిర్వహించారు.

తెలంగాణ స్ఫూర్తి సభ

తెలంగాణ స్ఫూర్తి సభ

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి హాజరయ్యారు.

తెలంగాణ స్ఫూర్తి సభ

తెలంగాణ స్ఫూర్తి సభ

ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో తెలంగాణ ప్రవాసులు, టిఆర్ఎస్ కార్యకర్తలతో పాటు మెల్బోర్న్‌లో నివసిస్తున్న ఆంధ్రాకు చెందిన కొందరు టిఆర్ఎస్ మద్దతుదారులు పాల్గొన్నారు.

తెలంగాణ స్ఫూర్తి సభ

తెలంగాణ స్ఫూర్తి సభ

ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ టిఆర్ఎస్ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల అధ్యక్షతన ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ముందుగా జయశంకర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ అమరవీరులను , జయశంకర్ సార్‌ను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+