అమెరికాలో సిద్ధిపేట టెక్కీ అనుమానాస్పద మృతి
సిద్ధిపేట: తెలంగాణలోని సిద్ధిపేటకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీరు అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఆ టెక్కీని 28 ఏళ్ల కృష్ణ చైతన్యగా గుర్తించారు. సిద్ధిపేటలోని మారుతి నగర్ కాలనీకి చెందిన వెంకన్నగారి శ్రీనివాసులు, రాణి దంపతుల చిన్న కుమారుడు అతను.
కృష్ణ చైతన్య నాలుగేళ్ల క్రితం కాగ్నిజెంట్ సంస్థలో ఆన్‌సైట్ ఉద్యోగిగా అమెరికా వెళ్లాడు. ఇటీవలే అతను డల్లాస్‌లోని సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌లో చేరాడు. ఓ పెయింగ్ గెస్ట్‌హౌస్‌లో నివాసం ఉంటున్నాడు.
ఈ నెల 26వ తేదీన అతను తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడాడు. తనకు తలనొప్పిగా ఉందని, ఉదయం మాట్లాడుతానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఈ నెల 27వ తేదీన అతను గది తలుపులు తెరవలేదు. దీంతో గెస్ట్‌హౌస్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు.

తలుపులు తెరిచి లోనికి వెళ్లిన పోలీసులకు కృష్ణచైతన్య శవం కనిపించింది. కృష్ణ చైతన్య బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే, అతని మరణానికి వ్యాధి కారణమా, మరేమైనానా అనేది తేలాల్సి ఉంది.
కృష్ణ చైతన్య మృతదేహాన్ని భారత్‌కు తెప్పించడానికి మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఈ విషయంపై ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాకు, భారత విదేశాంగ కార్యదర్శికి లేఖలు రాశారు. గురువారానికి మృతదేహం భారత్ చేరుకునే అవకాశం ఉంది.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications