వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్యాపిల్లల హత్య: తెలుగు టెక్కీ దోషి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ముగ్గురిని హత్య చేసిన కేసులో అమెరికా కోర్టు తెలుగు టెక్కీ నెరుసు లక్ష్మీనివాస రావు (46)ను దోషిగా తేల్చింది. అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా వుయ్యూరుకు చెందినవాడు. మిచిగాన్‌లోని నోవీలో తన భార్య ఎన్ జయలక్ష్మి, కుమారుడు శివ (12), కూతురు తేజస్వి (14)లను గొంతు కోసి హత్య చేసినట్లు అతనిపై ఆరోపణలు వచ్చాయి.

ఆ కేసులో లక్ష్మీనివాస రావును మిచిగాన్‌లోని ఓక్లాండ్ కౌంటీ సర్క్యూట్ కోర్టు దోషిగా తేల్చింది. జులై 3వ తేదీన అతనికి విధించే శిక్షను కోర్టు ఖరారు చేయనుంది. ఫస్ట్ డిగ్రీ మర్డర్‌లో దేషిగా జీవిత ఖైదు పడుతుంది. పెరోల్‌కు అవకాశం కూడా ఉండదు.

 Telugu techie convicted in United States

తీర్పు వెలువరించే సమయంలో లక్ష్మీనివాస రావులో ఏ విధమైన ప్రతిస్పందనలు కూడా కనిపించలేదు. 2008 అక్టోబర్ 13వ తేదీన భార్యాపిల్లలను హత్య చేసిన తర్వాత అతను ఇండియాకు పారిపోయి వచ్చాడున. ఆంధ్రప్రదేశ్ సిఐడి సహకారంతో అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 2013లో ఇంటర్నేషనల్ వారంట్ జారీ చేసింది.

విస్తృతమైన గాలింపు చర్యల ఫలితంగా అతు 2013 ఫిబ్రవరి 20వ తేదీిన పోలీసులకు చిక్కాడు. భార్యను 59 సార్లు పొడిచినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అతను మానసికంగా దుర్బలుడేమీ కాదని వైద్య పరీక్షల్లో తేలింది. కుటుంబ సమస్యలే హత్యలకు కారణమని భావిస్తున్నారు.

English summary
Software engineer Nerusu Lakshmi Nivasa Rao, a 46-year-old native of Vuyyuru in Krishna district, who was accused of a triple-murder was convicted by a United States court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X