వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూజెర్సీలో 'తెనా' ఆధ్వర్యంలో బంగారు తెలంగాణ

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

న్యూజెర్సీ: న్యూజెర్సీలో తెనా ఆధ్వర్యంలో జరిగిన సచేతన తెలంగాణ సభలో పాల్గొన్న వక్తల పిలుపు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో తెలంగాణ కోసం కృషి చేస్తున్న ఎన్నారైల సంఘం తెనా, తెలంగాణ ఆవిర్భావ రెండవ వార్షికోత్సవ సందర్భంగా పలు నగరాల్లో (బోస్టన్, కనెక్టికట్ తదితర) తెలంగాణ నుండి విచ్చేసిన విశిష్ట అతిథులు కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్, సీఎంఓ ఓఎస్టీ తెలంగాణ సాంస్కృతిక సైనికుడు కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్‌లతో సచేతన తెలంగాణ - అవకాశాలు సవాళ్ళు అనే అంశంపై విజయవంతంగా సభలు నిర్వహంచింది.

ఇందులో భాగంగా తెనా న్యూజెర్సీ చాప్టర్ జూన్ 12 ఆదివారం నాడు సాయంత్రం న్యూజెర్సీ ఎడిసన్‌లో గోదావరి రెస్టారెంట్‌లో సభ నిర్వహించింది. దాదాపు రెండు వందల మంది ఔత్సాహికులైన తెలంగాణ ఎన్నారైలు హాజరైన ఈ సభ అత్యంత సంబరంగా జరిగింది.

సభను ప్రారంబిస్తూ తెనా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ కొంపల్లి సభకు అధ్యక్షత వహించాల్సిందిగా తెనా చైర్మెన్ నారాయణస్వామి వెంకటయోగిని, విశిష్ట అతిథులుగా విచ్చేసిన ఎంపీ వినోద్ కుమార్, దేశపతి శ్రీనివాస్, ప్రముఖ తెలంగాణ వాది ఎమ్మెల్సీ యాదవరెడ్డిని, కొత్తపల్లి జయశంకర్ విశ్వవిద్యాలయ విశ్రాంతి రెజిస్ట్రార్ ప్రొఫెసర్ జలపతి రావులను వేదిక మీదికి ఆహ్వానించారు.

tena meeting at new jersey

అతిథులకు తుహిన, తుషిర, విద్య, జమునలు పుష్ప గుచ్చాలను అందించారు. ప్రారంభోపన్యాసం చేస్తూ నారాయణస్వామి వెంకటయోగి తెనా లక్ష్యాలను, ఆశయాలను, గత పదేళ్ళకు పైగా తెనా చేస్తున్న కార్యక్రమాలను, ముఖ్యంగా సాంస్కృతిక రంగాన్ని కార్యక్షేత్రంగా యెంచుకుని చేస్తున్న కార్యక్రమాలను వివరించారు.

భిన్నత్వం (diversity) విభిన్న శక్తుల కలయిక (inclusiveness) ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం తదితర ఆశయాలతో పనిచేస్తున్న సంస్థగా తెనాను అభివర్ణిస్తూ మాది అంగబలం అర్ధబలం కన్నా ఆశయ బలం గల సంస్థ అని చెప్పారు. తర్వాత అతిథులను పరిచయం చేసారు.

ముందుగా సాంస్కృతిక రంగం గురించి మాట్లాడుతూ దేశపతి శ్రీనివాస్ ఇన్నాళ్ళూ వివక్షకు గురైన అపురూపమైన తెలంగాణ సంస్కృతి గొప్పదనం గురించి దానిని కాపాడుకుని మరింత గొప్పగా ప్రజాస్వామికంగా తీర్చి దిద్దుకోవాల్సిన అవసరం గురించి అద్భుతంగా ఉపన్యసిస్తూ తన మాటతో ఆటతో సభికులను అలరించారు.

tena meeting at new jersey

ఆ తర్వాత ప్రసంగించిన ప్రొఫెసర్ జలపతి రావు ప్రస్తుత వ్యవస్యాయ రంగం గురించి అది ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి రైతుల ఆత్మహత్యలను నివారించి వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి ఉపన్యసించారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాధించుకోవడంలో వారి పాత్ర అద్వితీయమని వర్ణిస్తూ తెలంగాణ పునర్నిర్మాణంలో ఎన్నారైలు సహకరించాలని పిలుపునిచ్చారు.

తర్వాత తెనా అధ్యక్షులు వెంకట్ మారోజు ఉపన్యసిస్తూ ఇప్పటిదాక తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న అభివృద్ధి కార్యక్రమాలను టూకీ గా వివరించి ఇంకా సాధించాల్సిన దాని గురించి చేపట్టాల్సిన కార్యక్రమాలు, వైఫల్యాలు, సవాళ్ళ గురించీ మాట్లాడారు. ముఖ్య అతిథి ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్యంలో చేపడుతున్న కార్యక్రమాలను కూలంకషంగా వివరించారు.

వాటిలోని మంచినీ, ప్రజలకు జరుగుతున్న మేలునూ అనేక అభివృద్ధి పథకాలనూ వివరించారు. వాటి మీద ప్రచారమైతున్న కొన్ని అసత్యాలను వివరించి అపోహలను పోగొట్టే ప్రయత్నం చేసారు. అదేవిధంగా ఎన్నారైలు ఎవిధంగా సహాయపడవచ్చో, ఎలా ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతునిస్తూ, అవి సక్రమంగా అమలయేందుకు సరైన పద్దతిలో విమర్శిస్తూ తోడ్పడవచ్చో వివరించారు.

tena meeting at new jersey

ఎన్నారైలంతా కలసి కట్టుగా ముందుకొచ్చి తెలంగాణ అభివృద్ధి లో పాలు పంచుకోవచ్చో ఉదాహరణలతో సూచించారు. వినోద్ కుమార్ ప్రసంగం తర్వాత చర్చా కార్యక్తమం జరిగింది. అందులో సభికులు అనేక మంది ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. టీడీఎఫ్‌కు చెందిన మధు కె రెడ్డి మురళి చింతలపాణి, జమున పుస్కూర్, స్రవంత్ పోరెడ్డి, ఐ ఫర్ ఫార్మర్స్ శ్రీనివాస్ రణబోతు, సురేష్ ఈడిగ, రత్నాకర్, చైతన్య, శ్రీనివాస్ కొంపల్లి, రాయ్ దాస్ మంతెన, తెనా మాజీ చైర్మన్ రవి మే రెడ్డి విజన్ తెలంగాణ శ్రీధర్ గుడాల, ప్రముఖ హేతువాది బాబు గోగినేని తదితరులు అడిగిన ప్రశ్నలకు ఎంపీ వినోద్, శ్రీనివాస్, యాదవ రెడ్డి ఎంతో ఓపికగా సమధానాలిచ్చారు.

దాదాపు రాత్రి పదిన్నర వరకు జరిగిన సభలో తెనా బాధ్యులు అమర్ కర్మిల్లా, సురేందర్ మద్ది, వర్ష బియ్యాల, సతీష్ జిల్లా, రవి కోడెల, రాజ్ తోట, శ్రవణ్ , ఆటా అధ్యక్షులు సుధాకర్ పేర్కారి, నాటా బాధ్యులు శ్రీనివాస్ గనగోని, ప్రముఖ కవి వడ్డేపల్లి కృష్ణ, స్వామి సవితానంద, బీజేపీ బాధ్యురాలు సునీత, తెరాస బాధ్యులు బాబూ రావు కర్మిల్లా, కళాభారతి బాధ్యులు ప్రదీప్ సువర్ణ, టాటా బాధ్యులు రమేష్ చంద్ర తదితరులెందరో పాల్గొన్నారు. సభను విజయవంతం చేసిన అందరికీ సతీష్ వందన సమర్పణ చేసారు.

English summary
tena meeting at new jersey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X