NRI News: వీడిన ఎన్నారై మహిళ హత్య కేసు మిస్టరీ..
వడోదరలో జరిగిన ఎన్నారై మహిళ హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. 100 కోట్ల ఆస్తిని చేజిక్కించుకోవడానికి ఇద్దరు కలిసి మహిళన్ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన తర్సలి గ్రామంలో జరిగింది. 76 ఏళ్ల ఎన్నారై మహిళ సులోచ్నాబెన్ కు పిల్లలు లేరు. ఆమె విదేశాల్లో కొన్ని సంవత్సరాల పాటు ఉండి ఇండియాకు వచ్చారు. ఆమె భర్త కొద్ది సంవత్సరాల క్రితం మరణించాడు. దీంతో ఆమె తన బంధువు నయన్ అమీన్ అలియాస్ లాలూ అమీన్ చేరదీసింది. అయితే నయన్ సులోచనాబెన్ తన ఆస్తిని నాకు ఇస్తుందని ఆశపడ్డాడు. కానీ అది జరగలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నయన్ సులోచనబెన్‌పై కోపం పెంచుకున్నాడు.
ఆమె హత్య చేయాలని భావించాడు. ఇంతకు ముందు సులోచనాబెన్ ఇంట్లో అద్దెకున్న హేమంత్ పటేల్ సహకారం తీసుకున్నాడు. హేమంత్ సులోచనాబెన్ ఇంట్లో అద్దెకు ఉన్నప్పుడు తాగొచ్చేవాడు. దీంతో సులోచనాబెన్ అతని ఇంట్లో నుంచి వెళ్లిగొట్టింది. అప్పటి నుంచి సులోచనాబెన్ పై హేమంత్ పటేల్ కోపం పెంచుకున్నాడు. దీంతో నయన్ అమీన్, హేమంత్ వృద్ధరాలిని హత్య చేయాలని ప్రణాళిక వేసుకున్నారు.

ఇందులో భాగంగా నవరాత్రుల తొలిరాత్రి హత్యకు కుట్ర పన్నారు. తద్వారా గార్బా లౌడ్‌స్పీకర్లలో శబ్దంలో హత్యం చేస్తే ఎవరికి తెలియదని భావించారు. ఆదివారం రాత్రి వృద్ధురాలిని హత్య చేశారు. హత్య అనంతరం ఇంట్లోని రక్తపు మరకలను కూడా శుభ్రం చేసి ఆధారాలను ధ్వంసం చేశారు. అంతే కాకుండా బట్టలపై మరకలను కూడా నీటితో శుభ్రం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసు విచారణ చేపట్టారు.
సులోచనబెన్‌ను హత్య చేసిన తర్వాత నిందితుడు హేమంత్ తనతో పాటు సులోచనబెన్ మొబైల్ ఫోన్ తీసుకెళ్లాడు. దీంతో హేమంత్‌ను మొబైల్ ఆధారంగా పట్టుకున్నారు. నిందితులు ఇద్దరు సులోచనాబెన్ గది వెనుక తలుపు నుంచి లోపలికి ప్రవేశించారని పోలీసులు తెలిపారు. సులోచనబెన్ ప్రతిఘటించే ప్రయత్నం చేశారని.. కానీ, వయోభారం వల్ల ఆమె ప్రతిఘటించలేకపోయరాని చెప్పారు. కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications