NRI News: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు హైదరాబాదీల మృతి..
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు మాస్టర్స్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. కెంటకీలోని జాన్స్‌బర్గ్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మహ్మద్ ఫైసల్, ఇషాముద్దీన్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. మూడో విద్యార్థికి తీవ్రగాయాలు కాగా అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.వారి మృతదేహాలు హైదరాబాద్ చేరుకున్నాయి. మహ్మద్ ఫైసల్, ఇషాముద్దీన్ లకు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.
గత నెలలో భారతదేశానికి చెందిన నార్త్‌వెస్ట్ మిస్సౌరీ స్టేట్ యూనివర్శిటీ విద్యార్థి, సాహితీ, US హైవే 71లో స్నేహితుడితో ప్రయాణిస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. సాహితీని మిస్సౌరీలోని సెయింట్ జోసెఫ్‌లోని మొజాయిక్ లైఫ్ కేర్‌కు తరలించారు. గర్భాశయ వెన్నెముక పగినట్లు వైద్యులు తెలిపారు. మరొక దురదృష్టకర సంఘటనలో, న్యూజెర్సీలోని ప్లెయిన్స్‌బోరోలో నివాసం ఉంటున్న ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాకు చెందిన శ్రీకాంత్ దిగాలా అనే 39 ఏళ్ల వ్యక్తి ప్రిన్స్‌టన్ జంక్షన్ స్టేషన్‌లో ఇంటర్-సిటీ రైలు ఢీకొని మరణించాడు.

మూడు రోజుల క్రితం తెలంగాణలోని యాదాద్రి జిల్లా వాసి ఫిలిప్పీన్స్ దేశంలో మృతి చెందాడు. 'దవోవ మెడికల్' కాలేజీలో వైద్య విద్యను అభ్యసిస్తున్న గూడూరు మణికాంత్ రెడ్డి అనుమానాస్పదస్థితిలో మరణించాడు. మణికాంత్ రెడ్డి మృతిపై ఫిలిప్పీన్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం రామలింగంపల్లి గ్రామానికి చెందిన మణికాంత్ రెడ్డి ఎనిమిది నెలల క్రితం ఫిలిప్పీన్స్ వెళ్లాడు. ఏప్రిల్ 23న తెల్లవారుజామున మణికాంత్ రెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు దవోవ మెడికల్ కళాశాల యాజమాన్యం ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
Two hyderabadi youths Mohd Faisal and Ishamuddin who died after an accident in Kentucky, Johnsburg highway there Namaz E Janaza was performed at Daar Ul Islam Masjid, St Louis and burial was also completed. pic.twitter.com/NEZnWlyCIw
— Amjed Ullah Khan MBT (@amjedmbt) April 25, 2023
కొద్ది రోజుల క్రితం ఇంగ్లాండ్ లో తెలంగాణకు చెందిన యువతి మృతి చెందింది. హైదరాబాద్ కు చెందిన యువతి పై చదువులకు లండన్ వెళ్లి అక్కడే కన్నుమూశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరుకు చెందిన కొమ్మారెడ్డి శశిధర్ రెడ్డి, జ్యోతి దంపతులు హైదరాబాద్ వచ్చిఐఎస్‌సదన్ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి కూతరు తేజస్వి ఉన్నారు. ఆమె హైదరాబాద్ లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో సీఎస్ఈ బిటెక్ పూర్తి చేశారు.
పై చదువుల కోసం లండన్ లోని క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. గత సంవత్సరం సెప్టెంబర్ లో ఆమె లండన్ వెళ్లారు. అయితే ఏప్రిల్ 11న ఆమె తన స్నేహితులతో కలిసి బ్రైటని బీచ్ కు వెళ్లారు. అక్కడ ఫ్రెడ్స్ కలిసి ఎంజాయ్ చేశారు. నీటిలోకి తిగడంతో భారీ అలలకు సముద్రంలోకి కొట్టుకెళ్లారు. వెంటనే అలర్ట్ అయిన స్నేహితులు ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందానికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడి చేరుకున్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం తేజస్వి కోసం గాలింపు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీసింది.












Click it and Unblock the Notifications