NRI News: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ విద్యార్థుల మృతి..

కరీంనగర్ జిల్లాలో విషాదం నెలకొంది. అమెరికాలో జరిగిన రోడ్డు యాక్సిడెంట్ లో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారి స్వగ్రామాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ చెందిన వైద్య దంపతులు నవీన్, స్వాతి కొడుకు నివేశ్ అమెరికాలో చదువుకుంటున్నాడు. అలాగే జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ కు చెందిన కమల్ కుమార్, పద్మ దంపతుల కొడుకు గౌతమ్ కుమార్ కూడా అమెరికాలో చదువుతోన్నాడు. నివేశ్, గౌతమ్ అమెరికాలోని అరిజోనా స్టేట్ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతోన్నారు.

వీరిద్దరు శనివారం రాత్రి మిగతా స్నేహితులతో కలిసి కారులో యూనివర్సిటీ నుంచి రూమ్ కు వెళ్తున్నారు. వీరి కారు వెనక ఓ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో వెనక సీట్ లో కూర్చున్న నివేశ్, గౌతమ్ కుమార్ ఘటనా స్థిలిలోనే కన్నుమూశారు. మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఆదివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తీవ్ర రోధించారు.

Two Telangana students died in a road accident in America

నివేశ్ మృతదేహాన్ని హుజూరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గౌతమ్ కుమార్ డెడ్ బాడీ కూడా స్వస్థలానికి చేరుకోవడానికి మూడు రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితం ఏపీకి చెందిన ఓ ఫ్యామిలీ కూడా రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో తల్లీకూతుళ్లు మృతి చెందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+